365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 15, 2025: ప్రతి ఆదివారం ప్రేక్షలకు వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు, ఈ వారం మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. సుధీర్ బాబు, ఆర్ణ జంటగా నటించిన “మా నాన్న సూపర్ హీరో” సినిమా ఫిబ్రవరి 16న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.
తండ్రీకొడుకుల అనుబంధానికి అద్భుతమైన రూపం ఇచ్చిన ఈ హృదయస్పర్శి చిత్రం, ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.
ఇది కూడా చదవండి..ప్రధాని మోదీ చేతుల మీదుగా సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ ప్రారంభం.
ఇది కూడా చదవండి..ఫ్రెంచ్ ముద్దు: ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది..?
అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలతో కూడిన అనుబంధాన్ని హృద్యంగా చూపించారు. చిన్నతనంలోనే తండ్రి ప్రకాష్ (సాయిచంద్) నుంచి దూరమైన జాని (సుధీర్ బాబు), అనాథాశ్రమంలో పెరుగుతాడు.

వ్యాపారవేత్త శ్రీనివాస్ (సాయాజీ షిండే) జానీని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. కానీ, శ్రీనివాస్ అనవసరంగా ఓ చీటింగ్ కేసులో చిక్కుకోగా, అతన్ని జానీ ఎలా కాపాడాడో, తన కన్నతండ్రిని ఎలా కలుసుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం “మా నాన్న సూపర్ హీరో” సినిమా తప్పకుండా చూడాల్సిందే!
ఈ చిత్రంలో సుధీర్ బాబు, ఆర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా, సాయాజీ షిండే, సాయిచంద్, ఆమని, రాజు సుందరం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ కథను మీరు తప్పకుండా ఆస్వాదించాల్సిందే!
ఇది కూడా చదవండి..సామ్‌సంగ్ అత్యంత సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్06 5జీ భారతదేశంలో విడుదల
Read this also… Samsung Unveils Galaxy F06 5G: India’s Most Affordable 5G Smartphone
Read this also…LiftEd Transforms Foundational Learning for 3.3 Million Children, Strengthening India’s NIPUN Bharat Mission
ప్రసార సమయం: ఫిబ్రవరి 16, ఆదివారం – మధ్యాహ్నం 12 గంటలకు
ఎక్కడ: మీ జీ తెలుగు చానల్‌లో!
ఈ ఆదివారం మీ కుటుంబంతో కలిసి ఈ హృద్యమైన కథను ఆస్వాదించండి!