Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th SeptemberMaestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September
Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September
Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్ ,సెప్టెంబర్ 17,2021:ఈ ప్రపంచంలో మనుగడ అనేది అబద్ధాల ప్రపంచాన్ని అంగీకరించే ఖర్చుతో వస్తే,మీరు దేన్ని ఎంచుకుంటారు ? బ్లాక్ బస్టర్‌గా హిందీ,తమిళ చిత్రాలతో సంచలనం సృష్టించిన అనంతరం,డిస్నీ+ హాట్‌స్టార్ తన కొత్త, ఇప్పటికే చందాదారులుగా ఉన్న వారి కోసం మొదటి భారీ టికెట్ తెలుగు చిత్రం మాస్ట్రోను అందుబాటులోకి తీసుకు వచ్చింది.నటులు నితిన్,తమన్నా,నభానటేష్‌తో సహా అత్యంత ప్రతిభావంతులైన తారాగణాన్ని కలిగి ఉన్న మాస్ట్రో చిత్రం ఆయుష్మాన్ ఖురానా,టబు,రాధికా ఆప్టే నటించిన అంధాధున్‌కు అధికారిక రీమేక్.సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మాస్ట్రో తనకు తెలిసిన నేరాన్ని ఫిర్యాదు చేసేందుకు వెళ్లి ఉచ్చులో చిక్కుకున్న అంధ పియానిస్ట్ జీవిత గమనాన్ని మార్చే అనేక రహస్య సంఘటనలను అన్వేషిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం,మేర్లపాక గాంధీ అద్భుతమైన దర్శకత్వంలో వస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ ప్రేక్షకులతో వినోదభరిత మైన ప్రయాణాన్ని కచ్చితంగా తీసుకు వెళుతుంది.ఇది
సెప్టెంబర్ 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది .ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ
తెలుగు థ్రిల్లర్ ఈ వారాంతంలో మీరు పూర్తి చేయవలసిన అతి పెద్ద జాబితాలో ఒకటిగా ఉండేందుకు
ఇక్కడ ఐదు కారణాలు ఉన్నాయి:

క్రైమ్-థ్రిల్లర్

Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September
Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September

ఇప్పటికే అందరి నుంచి అత్యంత చక్కని ప్రశంసలు అందుకున్న మాస్ట్రో ట్రైలర్‌ను అవలోకిస్తే,ఈ క్రైమ్ థ్రిల్లర్ నుంచి ప్రేక్షకులు దేన్ని వేచి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తనకు తెలిసిన నేరం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లి ఉచ్చులో చిక్కుకున్న అంధ పియానిస్ట్ జీవిత గమనాన్ని మార్చే రహస్య సంఘటనల శ్రేణిని ఆవిష్కరిస్తుంది.సినిమా థీమ్‌కు నేపథ్య సంగీతం థ్రిల్లర్ కారకాన్ని మరింత పెంచడం,ప్రేక్షకులు ఈ క్రైమ్ థ్రిల్లర్‌ తో వెన్ను జలదరించేఅనుభూతిని ఆశించవచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్ రూపొందించిన మొదటి భారీ టికెట్ తెలుగు చిత్రం

హిందీ,తమిళ భాషల్లో ఒక చక్కని విజయాన్ని మూటగట్టు కున్న అనంతరం,డిస్నీ+హాట్‌స్టార్ మల్టీప్లెక్స్ బ్యానర్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ తన మొదటి భారీ టికెట్ తెలుగు చిత్రం మాస్ట్రో విడుదలను ప్రకటించింది.ఈ ప్లాట్‌ఫారాన్ని తెలుగు వినోదంలో తన ఆఫరింగ్‌లతో విస్తరించడం ద్వారా వినోదాన్ని సరికొత్త తీరాలకు తీసుకు వెళ్లే ప్రయత్నాన్ని చేపట్టింది.

ప్రతిభావంతులైన తారాగణం

Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September
Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September

రీమేక్‌లో అత్యంత ప్రతిభావంతులైన,వర్ధమాన తారాగణం ఉంది; నితిన్ చేయని తప్పును తమన్నా
అతనికి బలవంతంగా ఆపాదించేందుకుప్రయత్నిస్తుంది ,నభా నటేశ్ అద్భుతంగా పోషించిన పాత్ర సినిమాకు జీవాన్ని అందిస్తుంది. ట్రైలర్ అద్భుతమైన పాత్ర చిత్రణలను అందించగా, ఇందులోని తారాగణం చూపించిన నటనా కౌశల్యాలు సినిమా విడుదలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తోంది.

గ్రిప్పింగ్ స్టోరీలైన్

అంధాధున్ తరహాలో మాస్ట్రో థీమ్ పచ్చి అబద్ధాల చుట్టూ తిరుగుతుంది,అవి ఎలా చేదు ఘటనలుగా మారతాయో ఇందులో తెలుసుకోవచ్చు.తనను తాను రక్షించుకునే పరిస్థితి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉన్న వ్యక్తి, ఒక హత్య కేసులో చిక్కుకున్న దృష్టి లోపం ఉన్న ఒక సాధారణ వ్యక్తి ప్రపంచం గురించి ట్రైలర్‌లో మనం చూశాము. రొమాంటిక్ పాత్రలు పోషించడంలో ప్రఖ్యాతి పొందిన నటుడు నితిన్ మొదటిసారిగా డార్క్ కామెడీలో కనిపించడం ఈ చిత్రంలో చూస్తాము.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం

Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September
Maestro, starring actors Nithiin, Tamannaah, and Nabha Natesh, makes for the perfect weekend watch, coming on Disney+ Hotstar on 17th September

చక్కని డిటెయిల్స్‌పై దృష్టి సారించి, ఒరిజినల్ సినిమా సారాన్ని వాస్తవమైన అర్థంలో సంగ్రహిస్తూ, మాస్ట్రో అద్భుతమైన స్క్రీన్ ప్లేని కలిగి ఉంది,మేర్లపాక గాంధీ తన దర్శకత్వ ప్రతిభతో కథనాన్ని అద్భుతంగా నడిపించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న అంధాధున్‌ దర్శకుని ప్రతిభకు అద్దం పడుతుండగా, కీలక సన్నివేశాలను ఒకేరకంగా చిత్రీకరించుకుంది ,
ప్రేక్షకులను డిస్నీ+ హాట్‌స్టార్‌లో వారి మొదటి భారీ టికెట్ తెలుగు చిత్రాన్ని తగిన డ్రమ్‌రోల్‌తో అందిస్తోంది.