deepika-padukone_ramcharan-ad

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మార్చి 27,2023: సౌత్ సినిమా సూపర్ స్టార్ రామ్ చరణ్ మంచి నటుడే కాదు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. తాజాగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు-నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే..

రామ్ చరణ్ ‘RRR’ చిత్రంలో తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఐతే సోషల్ మీడియాలో రామ్ చరణ్ పై జోరుగా చర్చ జరుగుతోంది. ఇవాళ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

deepika-padukone_ramcharan-ad

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత, రామ్ చరణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా ఉంది. దీపికా పదుకొనే ఆస్కార్ అవార్డు వేడుకకు వ్యాఖ్యాతగా చేసింది. అయితే రామ్ చరణ్, దీపికా పదుకొనేల 15 ఏళ్ల క్రితం ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

రామ్ చరణ్ 15 ఏళ్ల క్రితం ఫోటో వైరల్..


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో దీపికా పదుకొనే , రామ్ చరణ్ కలిసి ఉన్నారు. అయితే ఈ ఫోటో చాలా పాతది. ఆస్కార్ అవార్డ్ 2023 వేడుకలో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కనిపించాడు.

మరోవైపు, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫోటోలో, రెండు ఫోటోలు ఉన్నాయి. ఒకటి 2023 సంవత్సరానికి చెందినది కాగా ,మరొకటి 2008 సంవత్సరానికి చెందినది అంటే 15 సంవత్సరాల క్రితం ఫొటో.

దీపికా పదుకొణె, రామ్ చరణ్ కలిసి..


ఆస్కార్ అవార్డ్ 2023 వేడుకలో దీపికా పదుకొణె ,రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా. నిజానికి ఇద్దరూ సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు, భారతీయులే కాబట్టి కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలే. దీపికా పదుకొనే ,రామ్ చరణ్ ఇంతకు ముందు కలిసి పనిచేశారని, కాబట్టి వారు ఇప్పటికే ఒకరికొకరు తెలుసు.

2008లో ప్రకటన..

ramcharan_deepikapadukone

దీపికా పదుకొనే ,రామ్ చరణ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారనే వార్తలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సమాచారం ప్రకారం, దీపికా పదుకొనే రామ్ చరణ్ 2008 సంవత్సరంలో కలిసి శీతల పానీయాల కంపెనీ కోసం ఓ వ్యాపార ప్రకటన చేసారు. అదే సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ 15 ఏళ్ల ఫోటోలో ఇద్దరూ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.

ఆ ఫోటో చూసి జనాలు..

రామ్ చరణ్, దీపికా పదుకొనేల ఈ ఫోటోను చూసిన జనాలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఇలా రాశారు.. ” వారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు”. మరొక ఒక వ్యక్తి ” బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు..ఇప్పుడు ఇద్దరూ మరింత క్యూట్ అయ్యారు.”అంటూ కామెంట్ చేస్తున్నారు.

ramcharan-Ad

ఖరీదైన సినిమా నటుల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. అంతే కాదు అతనికి లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ భక్తి భావం కూడా ఎక్కువ. ఆయన ప్రతి సంవత్సరం 41 రోజులపాటు అయ్యప్ప స్వామి మహావ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మహావ్రతం సమయంలో అనేక కఠినమైన నియమాలను పాటిస్తారు రామ్ చరణ్.