365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్17, 2024: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోశాలగా పేరు పొందిన గగన్‌పహాడ్‌లోని ఉమ్దా నగర్‌లోగల సత్యం శివం సుందరం గోనివాస్ ఆధ్వర్యంలో “మహా అన్నకూట్ మహోత్సవం” అత్యంత వైభవంగా నిర్వహించారు.
ధరమ్‌రాజ్ రాంఖా అనే 84 ఏళ్ల వ్యక్తి గత 24 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఆవుల రక్షణకు అంకితం చేశారు. నగల వ్యాపారాన్ని విడిచిపెట్టి గోవులను సంరక్షించడంలో తన మొత్తం జీవిత కాలాన్ని కేటాయించారు, కబేళాల నుంచి రక్షించిన 6వేలకు పైగా ఆవులకు రాజభోగాలు అందిస్తున్నారు.
ఈ మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. అన్నకూట్ పండుగను “ఆహార పర్వతం”గా భావించడంతో, భగవంతుడికి ప్రత్యేకంగా తయారు చేసిన అనేక రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకలో పండిట్ శ్రీహరిశ్చంద్రజీ కులకర్ణి మహాలక్ష్మీ పంచకుండీయ మహాయజ్ఞం నిర్వహించగా, శ్రీఅనిరుధ్జీ తన మధురమైన భజనలతో కార్యక్రమానికి ప్రత్యేక శోభ తీసుకువచ్చారు.
గోశాల పరిధిలో 8 ఎకరాల స్థలంలో 80,000 చదరపు అడుగుల RCC షెడ్‌లలో 6000 కంటే ఎక్కువ ఆవులు, దూడలు, ఎద్దులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ గౌశాలకు ప్రత్యేకత, రాజభోగం అందించడంతో పాటు, ఆవు పాలను దూడల కోసం వదిలిపెట్టడం, పేడను జీవ ఎరువుగా అందించడం వంటి వినూత్న సేవలను అందిస్తోంది.
ధరమ్‌రాజ్ రాంఖా విశేషాలు..
24 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా తన 84 ఏళ్ల వయస్సులోనూ, ఎంతో ఉత్సాహంగా గోవులకు సేవ చేస్తున్నాడు. గోశాల నిర్వహణ కోసం నెలకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారు. గగన్‌పహాడ్‌లోని సత్యం శివం సుందరం గోనివాస్ ,బుర్జుగడ్డలోని గోకేంద్రం ఆధ్వర్యంలో రెండు గోశాలలను నడుపుతున్నారు.