365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 6,2025:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) పరిపాలనా భవనంలో ఈ రోజు ‘మహాపరినిర్వాణ్ దివస్’ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా, వర్సిటీ ఉప కులపతి (వీసీ) ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన ఈ మహనీయుడి సేవలను ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్, విశ్వవిద్యాలయ అధికారులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను స్మరించుకుంటూ తమ నివాళులు అర్పించారు.