365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 11,2023: అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే” అని జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి అన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరంగపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు మాదిగ, బొడ్డపాటి నాగేశ్వరరావు, మన్యం శ్రీను, కురుమల్ల మహేష్, సంగుల రమేష్, అడపా రవి కుమార్, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాసు, దేవన దుర్గాప్రసాద్ (DD),ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.