365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నాసిక్,మార్చి 12,2025: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎంఏఎస్ఎల్), భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది.

2005లో మహీంద్రా తమ తొలి ద్రాక్షల షిప్‌మెంట్‌ను యూరప్‌కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది.

Read this also…Mahindra Celebrates 20 Years of Leading Indian Table Grape Exports

Read this also…EU Strikes Back with New Tariffs as Trump’s Steel Duties Take Effect

ఇది కూడా చదవండి…దేశవ్యాప్తంగా 773 జిల్లాల్లో 5G సేవలు – కేంద్రం

సబోరో,ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్‌లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్‌లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్‌లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది.

ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను 3 రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందించింది. సంస్థకు నాసిక్‌లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా,  నాసిక్,  బారామతి,  సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.

గత 20 ఏళ్లలో ద్రాక్ష వ్యాపారంలో సాధించిన వృద్ధి ఎంఏఎస్ఎల్‌కు గర్వకారణం. వ్యవసాయ వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా సాగులో పరివర్తన తేవడంపై మాకున్న నిబద్ధతను ఈ మైలురాయి ప్రతిఫలిస్తుంది. మా కృషి ఫలితంగా ఇతర దేశాలకు భారతీయ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి.

అలాగే ప్రాంతీయంగా వందల కొద్దీ రైతుల జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలగడం మాకు సంతోషకరమైన విషయం ” అని ఎంఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ రామచంద్రన్ తెలిపారు. 6.5 ఎకరాల్లో, 75,000 చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన మహీంద్రా గ్రేప్ ప్యాక్ హౌస్‌లో నిత్యం 80 మెట్రిక్ టన్నుల ద్రాక్షలు ప్యాక్ చేయబడతాయి.

Read this also…5G Services Now Available in 773 Out of 776 Districts Across India

Read this also…Struggling with Sleep? The Hidden Threats in Your Bedroom Might Be to Blame

ఇందులో 12 ప్రీకూలింగ్ చాంబర్లు, 170 ఎంటీ సామర్థ్యంతో రెండు కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఒక్కో షిఫ్టులో 500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. సుస్థిర సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నాసిక్‌లో ఎంఏఎస్‌ఎల్‌కు 15 ఎకరాల్లో డెమో ఫార్మ్ ఉంది.