Wed. Jul 3rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 1,2024: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (FES) 2024 జూన్‌కి సంబంధించి తమ ట్రాక్టర్ల విక్రయాల గణాంకాలను ప్రకటించింది.

2024 జూన్‌లో దేశీయంగా అమ్మకాలు 45,888 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 జూన్‌లో ఈ సంఖ్య 43,364 యూనిట్లుగా నమోదైంది.

2024 జూన్‌లో మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు (దేశీయంగా + ఎగుమతులు) 47,319  యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే వ్యవధిలో అమ్మకాలు 44,478 యూనిట్లుగా నమోదయ్యాయి. సదరు నెలలో ఎగుమతులు 1,431 యూనిట్లుగా ఉన్నాయి.

“గతేడాదితో పోలిస్తే 2024 జూన్‌లో దేశీయ మార్కెట్లో 6% వృద్ధితో 45,888 ట్రాక్టర్లను విక్రయించాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదలపై, ప్రధాన ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ పెంపుపై ప్రభుత్వ ప్రకటనలతో పాటు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా రైతుల్లో సానుకూల సెంటిమెంటుకు తోడ్పడగలవు.

పొలాలను సిద్ధం చేసుకోవడం, ఖరీఫ్ పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలతో రిటైల్ పుంజుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ట్రాక్టర్లకు డిమాండ్ పటిష్టంగా ఉండగలదు. ఎగుమతుల మార్కెట్లో 1,431 ట్రాక్టర్లను విక్రయించాం.

గతేడాదితో పోలిస్తే ఇది 28% అధికం ” అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు.

Farm Equipment Sector Summary  
 జూన్YTD జూన్
 F25F24మార్పుF25F24మార్పు
       
దేశీయంగా45888433646%1169301118755%
       
ఎగుమతులు1431111428%4537313445%
       
మొత్తం47319444786%1214671150096%

*CKD కలిపి ఎగుమతులు

Also read :Mahindra’s Farm Equipment Sector Sells 45888 Units in India during June 2024

Also read : JSW MG Motor India Achieves Record Monthly ZS EV Retail Sales in June 2024

Also read : Godrej Properties acquires ~7-acre land parcel in Thanisandra,North Bengaluru

Also read : Mahindra Auto sells 40,022 SUVs, a 23% growth and total volumes of 69,397, a 11% growth in June 2024

Also read : Who are the actors in the second sequel of 2898 AD Kalki..?

Also read : Today National Doctors Day..

ఇదికూడా చదవండి: 2898 AD కల్కి రెండవ భాగంలో ఎవరెవరు నటులు..?