365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జహీరాబాద్,30 జనవరి 2022 :కోవిడ్–19 సంక్షోభ పరిష్కారానికి విస్తృతశ్రేణి, సానుభూతి తో కూడిన ప్రతిస్పందనలో భాగంగా మహీంద్రా గ్రూప్ నేడు 500 ఎల్‌పీఎం ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్,జహీరాబాద్, తెలంగాణా వద్ద ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది.ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక,ఆరోగ్య, వైద్య,కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు టి హరీష్‌రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌లోని మహీంద్రా ఆటోమోటివ్ వైస్ ప్రెసిడెంట్ వీ ఎస్ రామ్,ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ హ్యూమన్ రిసోర్శెస్ అండ్ కమ్యూనికేషన్స్ అధ్యక్షులు-రుజ్బెన్ ఇరానీ మాట్లాడుతూ ‘‘ఈ ప్రపంచం ఇప్పటికీ కోవిడ్–19 నుంచి కోలుకుంటూనే ఉంది. ఇప్పటికీ మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటిగా ఆక్సిజన్ లభ్యత నిలుస్తుంది.
మహమ్మారి నుంచి బలంగా బయటపడాలనే ఉద్దేశ్యంతో,మహీంద్రా ఇప్పుడు ప్రభుత్వాలతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా వైద్య మౌలిక వసతులు విస్తృత పరచడం, ఆక్సిజన్ ప్లాంట్‌లు,ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, అంబులెన్స్‌లు అందిస్తూనే తాత్కాలిక కోవిడ్–19 కేర్ కేంద్రాలనూ ఏర్పాటుచేస్తున్నాము’’అని అన్నారు.కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో తెలంగాణా ప్రభుత్వానికి మహీంద్రా గ్రూప్ మద్దతు నందిస్తుంది.గతంలో,ఈ గ్రూప్ రెండు ఆక్సిజన్ ప్లాంట్‌లను,పన్నెండు అంబులెన్స్ లను పలు ప్రభుత్వ,పబ్లిక్ చారిటబుల్ హాస్పిటల్స్‌కు తెలంగాణా రాష్ట్రంలో అందజేయడం జరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ గతంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో 1000ఎల్‌పీఎం ఆక్సిజన్ ప్లాంట్ అందించగా,
హైదరాబాద్‌లోని 200 పడకల హాస్పిటల్ సెయింట్ థెరిసా హాస్పిటల్‌లో 500 ఎల్‌పీఎం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా టెక్ మహీంద్రా ఫౌండేషన్ మద్దతు తెలిపింది.
ఈ గ్రూప్ పలు హాస్పిటల్స్‌కు ఫేస్ షీల్డ్స్,రేషన్ కిట్స్,భోజనాలు,ఫేస్ మాస్క్స్, పీపీఈ కిట్లు, ఏరోసోల్ బాక్స్‌లు, వైద్య యంత్ర సామాగ్రిని సైతం అందించింది. మహీంద్రా గ్రూప్ మొత్తం మీద 23 ఆక్సిజన్ ప్లాంట్‌లు,94 అంబులెన్స్‌లను 19 రాష్ట్రాలలో విరాళంగా అందించింది. వీటితో పాటుగా మహమ్మారితో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా పెద్ద మొత్తంలో నిధులను సైతం అందించడానికి కట్టుబడింది. ఈ గ్రూప్ ఇప్పుడు ప్రభుత్వ ఉపశమన ప్రయత్నాలకు మద్దతునందించడంతో పాటుగా
తమ ఉత్పత్తి శ్రేణి ,సదుపాయాలను తగు రీతిలో మార్చడంతో పాటుగా ఫేస్ షీల్డ్స్, ఫేస్ మాస్క్‌లు, ఏరోసోల్ బాక్స్‌లను తయారుచేస్తుంది,ఐసీయు పడకలు, అత్యవసర క్యాబ్ సేవలు, క్వారంటైన్ కేంద్రాలు, ఆక్సిజన్ ఆన్ డిమాండ్ అందించడంతో పాటుగా నగదు మద్దతు,డ్రై రేషన్‌ను నిరుపేదలకు అందించడం చేసింది.