365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై ,ఏప్రిల్ 17,2024: భారతదేశంలో దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా కొత్తగా బొలెరో నియో+ 9 సీటర్‌ను ఆవిష్కరించింది. P4 ప్రీమియం P10 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రైవర్‌ సహా 9 మంది ప్రయాణికులకు అనువైన, స్టైలిష్‌గా, విశాలంగా, దృఢంగా ఉండే ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్ల కోసం ఈ ఎస్‌యూవీ రూపొందించింది.

విశ్వసనీయమైన, శక్తిమంతమైన, ప్రదేశానికైనా వెళ్లగలిగే బొలెరో గుణాలతో బొలెరో నియో+ 9-సీటర్ రూపొందించినది. దీనికి స్టైలిష్ బోల్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్లు, నియో, టెక్నాలజీ అదనం. పెద్ద కుటుంబాలు, సంస్థాగత కస్టమర్లు, టూర్స్, ట్రావెల్ ఆపరేటర్లు, కంపెనీలకు వాహనాలను లీజుకి ఇచ్చే కాంట్రాక్టర్లు మొదలైన వర్గాల అవసరాలకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీ తీర్చిదిద్డింది.

“ఏళ్ల తరబడి నిలకడగా, అంచనాలను మించే పనితీరుతో, భారీతనానికి, విశ్వసనీయతగా మారుపేరుగా బొలెరో బ్రాండు కస్టమర్ల ఆదరణను చూరగొంటోంది. కుటుంబాలకు,ఫ్లీట్ ఓనర్లకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా అధునాతన ఫీచర్లతో అత్యంత సౌకర్యవంతంగా, మన్నికైనదిగా బొలెరో నియో+ను తీర్చిదిద్దాము” అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో శ్రీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు.

ఎక్కడికైనా ప్రయాణించగలిగే సామర్థ్యాలు గల శక్తిమంతమైన వాహనం:

సమర్ధమంతంగా ఇంధనం ఆదా చేసేందుకు, మెరుగైన పనితీరును అందించేందుకు బొలెరో నియో+లో మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీతో భారీ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ అమర్చింది. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం, అత్యంత దృఢమైన ఉక్కు బాడీ షెల్ అనేవి అత్యంత మన్నిక,భద్రతను అందించేలా తీర్చిదిద్దాయి.

సురక్షితమైన,సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం EBDతో ABS, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX చైల్డ్ సీట్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఆటోమేటిక్ డోర్ లాక్స్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో పొందుపర్చాయి.

స్టైలిష్ బోల్డ్ డిజైన్

X-ఆకారపు బంపర్లు, క్రోమ్ ఇన్‌సర్ట్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, X-ఆకారపు స్పేర్ వీల్ కవర్, సైడ్ బాడీ క్లాడింగ్ వంటి బొలెరో అంశాలన్నీ బొలెరో నియో+లో కూడా పొందుపర్చాయి. స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, కమాండింగ్ హుడ్ మొదలైనవి ఈ ఎస్‌యూవీకి మరింత గంభీరమైన లుక్ అందిస్తాయి.

40.64 సెం.మీ. అలాయ్ వీల్స్, దృఢమైన సైడ్,రియర్ ఫుట్‌స్టెప్స్‌తో బొలెరో నియో+ ఎస్‌యూవీ ఆత్మవిశ్వాసం,దర్జాతనం ఉట్టిపడేలా ఉంటుంది. ఎలాంటి రహదారి పైనైనా ఇట్టే దృష్టిని ఆకర్షిస్తుంది.

మెరుగైన ఇంటీరియర్స్, సౌకర్యం

ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్లు, బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్సిలరీ కనెక్టివిటీ గల 22.8 సెం.మీ. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంతో బొలెరో నియో+ అసమానమైన సౌకర్యాన్ని అందిస్తుంది. యాంటీ-గ్లేర్ IRVM, ఎలక్ట్రికల్‌గా సరిచేయతగిన ORVMలు, ఎత్తును సరిచేసుకోతగిన డ్రైవర్ సీటు మొదలైన ఫీచర్లు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

ఇటు సౌకర్యం అటు ఆచరణాత్మకంగా ఉండేలా ఇందులో ప్రంట్, రియర్ పవర్ విండోలు, ఆర్మ్‌రెస్ట్‌లు, విశాలమైన బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి. 2-3-4 ప్యాటర్న్‌లో అమర్చిన 9 సీట్లతో కూడుకున్న విశిష్టమైన సీటింగ్ కాన్ఫిగరేషన్ ఇటు ప్యాసింజర్లపరంగా అటు కార్గోపరంగా విశాలంగా ఉండటంతో ఈ ఎస్‌యూవీ ఎటువంటి ప్రయాణాలకైనా అనువైనదిగా ఉంటుంది.

వేరియంట్లు, ధర:

వివిధ వర్గాల అభిరుచులకు అనుగుణంగా బొలెరో నియో+ ఎస్‌యూవీ P4,P10 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. P4 ఎంట్రీ-లెవెల్ ఆప్షన్‌గాను, P10 మరింత ప్రీమియంగాను ఉంటుంది. డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అనువుగా, రెండు వేరియంట్లు ఇటు ప్యాసింజర్లు అటు లగేజ్‌కి తగినంత స్థలం ఉండేలా విశాలమైనవిగా ఉంటాయి.

మూడో వరుస ప్యాసింజర్లు వెనుక వైపు నుంచి నిరాటంకంగా లోనికి రావచ్చు.

దీని ధర ఆకర్షణీయమైన స్థాయిలో రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అందుబాటు ధరల్లో, విశ్వసనీయమైన ఉత్పత్తులను అందించాలన్న మహీంద్రా నిబద్ధతకు అనుగుణంగా ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు అనువుగా ఉంటుంది.

బొలెరో నియో+ ఎక్స్-షోరూం ధరలు ఇవీ:

బొలెరో నియో + P4

బొలెరో నియో + P10

రూ. 11.39 లక్షలు

రూ. 12.49 లక్షలు

Also read : Mahindra launches Bolero Neo+, starting at ₹ 11.39 Lakh..

Also read : India’s No.1* electric auto, Mahindra Treo Plus, launched with a metal body

Also read : Daimler India Commercial Vehicles set to foray into Battery Electric..

Also read : Meet Mr. Murtaza Deesawala rubber industries Head of Sales & Marketing..