365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 12,2024:రాబోయే ఖరీఫ్ సీజన్‌లో వరి, గోధుమల దిగుబడి అధికంగా ఉండగలదన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తమ రోటావేటర్ల శ్రేణికి నెలకొనే డిమాండ్‌కి అనుగుణంగా ఉండేలా మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ సన్నద్ధమవుతోంది.
తేలికపాటి సెగ్మెంట్‌లో మహీంద్రా రోటావేటర్లను గతేడాది విజయవంతంగా ప్రవేశపెట్టిన మీదట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాగు రంగంలో వేగవంతంగా యంత్రీకరణకు కంపెనీ తోడ్పడనుంది. ట్రాక్టర్ల తయారీలో పరిమాణంపరంగా మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ సంస్థగా ఉంది.

భారతదేశంలోని మహీంద్రా ఆర్&డీ కేంద్రాల్లో డిజైన్, అభివృద్ధి చేయబడిన మహీంద్రా రోటావేటర్ల సమగ్ర శ్రేణిలో హెవీ నుంచి లైట్ సెగ్మెంట్ దాకా ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి 15 నుంచి 70 హెచ్‌పీ వరకు సామర్ధ్యం గల ట్రాక్టర్లకు అనువుగా ఉంటాయి.
హెవీ సెగ్మెంట్ (మహావేటర్ సిరీస్, మహావేటర్ హెచ్‌డీ (హెవీ డ్యూటీ) సిరీస్), మీడియం సెగ్మెంట్ (సూపర్‌వేటర్ సిరీస్), లైట్ సెగ్మెంట్ (జైరోవేటర్ సిరీస్, ప్యాడీవేటర్ సిరీస్) మరియు చిన్న ట్రాక్టర్ యజమానులు, పళ్లతోటలు సాగు చేసే రైతుల కోసం మినీవేటర్ సిరీస్ మొదలైనవి ఈ శ్రేణిలో ఉన్నాయి.
అనువుగాను, విశ్వసనీయంగాను ఉండేలా చూసేందుకు, పూర్తి స్థాయిలో పనితీరు కనపర్చేలా మహీంద్రా రోటావేటర్లకు వివిధ పరిస్థితుల్లో కఠిన పరీక్షలు నిర్వహించబడతాయి. తద్వారా ఎటువంటి సమస్యా తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోబడతాయి.
బురదనేలల్లో, పొడి నేలల్లో, ద్రాక్షతోటల్లో, పళ్ల తోటల్లోను మట్టిని మెరుగ్గా కలియతిప్పేందుకు అత్యంత మన్నికైన మహీంద్రా బోరోబ్లేడ్స్ ఉపకరిస్తాయి. నాట్ల కోసం నారును సిద్ధం చేసుకునేందుకు, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా కలుపు, మిగుళ్లను మెరుగ్గా నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుంది.

బహుళ గేర్ల కాంబినేషన్ల వల్ల వేగవంతమైన టర్నెరౌండ్ ఉంటుంది. ఇంధనం గణనీయంగా ఆదా అవుతుంది. కఠినతరమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా అత్యంత నాణ్యమైన పెయింటు ఈ శ్రేణిలో ఉపయోగించబడింది.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణలోని మహీంద్రా ట్రాక్టర్ డీలర్ల నెట్‌వర్క్, ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద మహీంద్రా రోటావేటర్లు లభిస్తాయి. వేరియంట్‌ను బట్టి మహీంద్రా ఫైనాన్స్ 100 శాతం వరకు ఆకర్షణీయమైన, సులభతరమైన రుణ పథకాలను కూడా అందిస్తోంది.

ఇతర తయారీ సంస్థలు 6 నెలల వారంటీ మాత్రమే అందిస్తుండగా రైతుల నిశ్చింత కోసం మహీంద్రా రోటావేటర్లు ఈ విభాగంలోనే అత్యుత్తమంగా 1 నుంచి 2 ఏళ్ల వరకు తయారీదారు వారంటీతో లభిస్తాయి.
Also read :Mahindra is Gearing Up for Increased Demand for its Rotavator Range in Telangana and Andhra Pradesh this Kharif Season
Also read :Canon Developing New RF-S7.8mm f/4 STM Dual Lens for EOS R7 Camera for Recording Spatial Video for Apple Vision Pro
Also read : FOGSI releases a comprehensive immunization schedule for adult women and new mothers In India
Also read :Digital The Most Lucrative Channel for FMCG Brands: Meta Studies
Also read : Toshiba Johnson Elevators (India) to supply 60 high-speed ELCOSMO-IIIL elevators to Ultra-luxurious Tulip Monsella
Also read :Wadhwani Foundation, AICTE,and other Top Institutes Collaborate to Boost Research Commercialization in India
ఇది కూడా చదవండి : బంగారు ఆభరణాల దిగుమతిపై నిషేధం విధించిన ప్రభుత్వం..