365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 9, 2023: భారతదేశపు ప్రముఖ ఎస్ యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, 2023 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిష్టాత్మకమైన ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డు విజేత నిఖత్ జరీన్‌కు తన ప్రతిష్టాత్మక SUV పూర్తి సరికొత్త థార్‌ను అందజేసింది.

ఇండియన్ బాక్సర్, నిఖత్ జరీన్. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డ్‌ను సాధించారు. 2009లో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు వద్ద శిక్షణ పొందేందుకు విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆమె నమోదు చేసుకున్నారు. 2010లో ఈరోడ్ నేషనల్స్‌లో గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా ఆమె గుర్తింపు పొందారు.

గ్లోబల్ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్, ఆటోమోటివ్ డివిజన్ హెడ్ నేహా ఆనంద్ మాట్లాడుతూ “మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌గా ఆమె సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని నిఖత్ జరీన్‌కి పూర్తి సరికొత్త థార్‌ను అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, తమ కలలను నిర్భయంగా కొనసాగించేందుకు లెక్కలేనంత మంది యువతులను ప్రోత్సహిస్తుంది. మహిళల బాక్సింగ్‌కు మద్దతు ఇవ్వడం పట్ల మహీంద్రా గర్వంగా ఉంది.

నిఖత్ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు నూతన శిఖరాలకు చేరుకుంటూ తమ కలలను సాకారం చేసుకోవడానికి అసాధ్యమైన వాటిని అన్వేషించడానికి స్ఫూర్తిని అందిస్తుంది ” అని ఆన్నారు.

నిఖత్ జరీన్ రగ్గడ్ మహీంద్రా థార్ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నారు. బాక్సింగ్‌లో నిఖత్ అసాధారణమైన వేగం, ఖచ్చితత్వం, శక్తివంతమైన ఇంజన్ ,చురుకైన హ్యాండ్‌లింగ్‌తో విభిన్నమైన భూభాగాలపై థార్ పరాక్రమంతో చక్కగా సరిపోలతాయి.

తమ తమ రంగాలలో శక్తి, బహుముఖ ప్రజ్ఞ , ఛాంపియన్ స్పిరిట్‌ను మూర్తీభవించడంతో పాటుగా అచంచలమైన సంకల్పం, అనుకూలతకి ఉదాహరణగా వీరు నిలుస్తారు.

2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ మహిళా బాక్సర్లు ఆధిపత్యం చెలాయించారు. ఎనిమిది మంది బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌లో ,నలుగురు పతక రౌండ్‌లకు అర్హత సాధించారు.

63 దేశాలు పోటీపడగా 4 బంగారు పతకాలు సాధించి పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ మహిళా బాక్సర్ల విజయం దేశంలో క్రీడ ప్రొఫైల్‌ను పెంచడానికి సహాయపడింది. మరింత మంది బాలికలు బాక్సింగ్‌ను చేపట్టడానికి, క్రీడలో వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది.