365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,నవంబర్ 23,2025: ప్రపంచంలో అత్యధికంగా ట్రాక్టర్లు తయారు చేసే సంస్థగా పేరుగాంచిన మహీంద్రా & మహీంద్రా, నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆగ్రోవిజన్ 2025లో అత్యాధునిక ప్రత్యామ్నాయ ఇంధన ట్రాక్టర్లు,సుస్థిర వ్యవసాయ టెక్నాలజీలను ఆవిష్కరించింది.

ఈ కార్యక్రమానికి ఆగ్రోవిజన్ ప్యాట్రన్‌గా కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. అలాగే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆగ్రోవిజన్ 2025లో మహీంద్రా ప్రదర్శించిన ప్రధాన ఆవిష్కరణలు

🔹 CNG/CBG,డ్యుయల్ ఫ్యుయల్ ట్రాక్టర్
యువో టెక్+ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన ఈ ట్రాక్టర్ సీఎన్‌జీ, సీబీజీ ,డ్యుయల్ ఫ్యూయల్ (డీజిల్-సీఎన్‌జీ)తో పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

🔹 ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యుయల్ ట్రాక్టర్ ఇంజిన్
వ్యవసాయ ఉపఉత్పత్తులు, పంట వ్యర్ధాలు,చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌పై పని చేయగల వినూత్న ఇంజిన్ టెక్నాలజీ.

🔹 ఎలక్ట్రిక్ ట్రాక్టర్
నూతన తరం మహీంద్రా ఓజా ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ ట్రాక్టర్ మెరుగైన టార్క్, తక్కువ నిర్వహణ వ్యయాలు, ఫాస్ట్ చార్జింగ్ వంటి లక్షణాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

మహీంద్రా రీసెర్చ్ వాలీ (చెన్నై)లో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతలు, సుస్థిర వ్యవసాయ యాంత్రీకరణను లక్ష్యంగా పెట్టుకుని రూపుదిద్దుకున్నాయి.

పర్యావరణహిత సాగు పద్ధతులను ప్రోత్సహిస్తూ, 2070 నాటికి భారత్ నెట్-జీరో కర్బన ఉద్గారాలు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడే దిశగా ఇవి ముందడుగు వేస్తున్నాయి.

మహీంద్రా నాయకత్వం స్పందన

“సుస్థిర వ్యవసాయ భవిష్యత్తు దిశగా భారత్‌ను ముందుండి నడిపించడంలో మహీంద్రా కట్టుబడి ఉంది. ఆగ్రోవిజన్ 2025లో ప్రదర్శించిన మా ప్రత్యామ్నాయ ఇంధన ట్రాక్టర్లు, టెక్నాలజీలు మా విజన్‌కు నిదర్శనం,” అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు.

ప్రత్యామ్నాయ ఇంధన ట్రాక్టర్ల ప్రత్యేకతలు

పర్యావరణహితం

తక్కువ నిర్వహణ ఖర్చులు

పునరుత్పాదక ఇంధన వినియోగ సామర్థ్యం

జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ మోడల్స్

ఇంధన స్వావలంబనకు తోడ్పాటు

రైతులకు ఆర్థిక ప్రయోజనాలు

అదనంగా, మహీంద్రా ,స్వరాజ్ బ్రాండ్ల శక్తివంతమైన డీజిల్ 2WD/4WD ట్రాక్టర్లు, సాగు సాధనాలను కూడా ప్రదర్శించారు.