Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె,సెప్టెంబర్ 16,2024:భారతదేశంలో యుటిలిటీ వాహనాల తయారీలో అగ్రగామి మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా LCV<3.5 t సెగ్మెంట్‌ను పునర్నిర్వచించే మహీంద్రా వీరోని ఆవిష్కరించింది. ఈ వాహనం ప్రారంభ ధర రూ. 7.99 లక్షలుగా నిర్ణయించబడింది.

సెగ్మెంట్లోనే అత్యుత్తమ మైలేజీ, పటిష్టమైన బహుళ ఇంజిన్ ఆప్షన్లు, పరిశ్రమలోనే అత్యుత్తమ భద్రతా ఫీచర్లతో వీరో విభాగంలో సరికొత్త ప్రమాణాలను సృష్టించేందుకు రూపొందించబడింది. ఆక్యుపెంట్స్‌కు మెరుగైన రక్షణతోపాటు ప్రీమియం క్యాబిన్ అనుభూతిని కూడా ఇది అందిస్తుంది.

మహీంద్రా వినూత్న అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాం (యూపీపీ) ఆధారంగా, ఇది భారతదేశపు తొలి మల్టీ-ఎనర్జీ మాడ్యులర్ వాణిజ్య వాహన ప్లాట్‌ఫాం. ఈ వాహనం మొత్తం యాజమాన్య వ్యయాల్లో ఈ సెగ్మెంట్‌లోనే అత్యుత్తమ పనితీరు అందించేందుకు సిద్ధంగా ఉంది.

ఇది నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను మించేలా రూపుదిద్దుకుంది. డీజిల్, CNG ,ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఈ వాహనం వస్తుంది.

సెగ్మెంట్లోనే తొలిసారిగా డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 26.03 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతికతలను వీరో అందిస్తోంది.

1,600 కేజీల పేలోడ్ సామర్థ్యం, 3035 మి.మీ. కార్గో లెంగ్త్, 18.4 km/l* మైలేజీతో మహీంద్రా వీరో పట్టణ కార్యకలాపాల కోసం అత్యంత అనుకూలంగా రూపొందించబడింది.

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ, “మహీంద్రా వీరో మా LCV<3.5 t సెగ్మెంట్‌లో మా అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఈ వాహనం కస్టమర్లు తమ ఆదాయాన్ని మెరుగుపర్చుకోవడానికి సహాయపడేలా డిజైన్ చేయబడింది. సెగ్మెంట్లోనే అత్యుత్తమ మాన్యువరబిలిటీ, ప్రీమియం క్యాబిన్ అనుభవం, అత్యున్నత భద్రతా ఫీచర్లు ఈ వాహనాన్ని ప్రత్యేకత కలిగినదిగా మారుస్తాయి” అన్నారు.

error: Content is protected !!