365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,డిసెంబర్ 15,2025: భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా తమ హైటెక్, ట్రెండ్ సెటర్, ప్రీమియం ఎస్‌యూవీ XUV 7XOకి సంబంధించి ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 2025 డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గం.ల నుంచి ఈ వాహనాన్ని ప్రీ-బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీని కస్టమర్లు రూ. 21,000తో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

కస్టమర్లు తమకు నచ్చిన డీలర్‌షిప్, ఇంధనం రకం, ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకునేందుకు ప్రీ-బుకింగ్ సమయంలో వెసులుబాటు ఉంటుంది. XUV 7XO రెండు రకాల ఇంధన ఆప్షన్లు – పెట్రోల్,డీజిల్ – అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మహీంద్రా డీలర్‌షిప్‌లు, కంపెనీ ఆన్‌లైన్ మాధ్యమాలవ్యాప్తంగా ప్రీ-బుకింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

YouTube లింకు: https://www.youtube.com/watch?v=_nOTG6T_98E