Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 14,2022:మిడిల్ స్కూల్‌లో హార్మోన్ల ప్రభావంతో టీనేజర్లు పడే బాధలను డిస్నీ,పిక్సర్ తెరకెక్కించిన టర్నింగ్ రెడ్‌కు ప్రధాన ఇతివృత్తం కాగా, డోమీ షి దర్శకత్వం కూడా మార్పులకు లోనవుతున్న యుక్తవయస్సులో ఉన్న పలువురు టీనేజర్లలో ఇది ఆసక్తిని రేకెత్తిస్తుంది. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్ గాత్రదానం చేసిన ప్రియ పాత్ర ఎదుగుతున్న మనస్సుల సారాంశం అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ప్రియా పాత్రకు అనుగుణంగా,ఆమె సిగ్నేచర్ స్టోయిక్ పర్సనాలిటీని వివరించడం గురించి తన అనుభవాన్ని పంచుకుంటూ, ఆమె పాత్ర నిజ జీవితంలో తనను ఎలా పోలి ఉంటుందో ఈ నటి పంచుకున్నారు.

‘‘సినిమాలు,టీవీలు సహజమైన మార్గంలో ప్రామాణికత వైవిధ్యాన్ని కలిగి ఉన్న దిశ లో ఎలా చలిస్తున్నాయో పరిశీలించడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది కేవలం చూపించి చెప్పడమే కాదు. టర్నింగ్ రెడ్‌ని చూస్తున్న యువ ప్రేక్షకులు ఈ వాస్తవికతను తమకు న్యూ నార్మల్ అంశంగా అంగీకరించబోతున్నారు,ప్రాతినిధ్యం కోసం తగిన నిరీక్షణను కలిగి ఉంటారు. ప్రియ తన పాఠశాలకు చాలా ప్రశాంతంగా, గుట్టును తనలోనే దాచుకునే అమ్మాయిగా పైకి కనిపించినప్పటికీ,మిడిల్ స్కూల్ అంటే బోర్ అని భావించే యువతి పాత్రకు నేను వ్యక్తిగతంగా అనుసంధానాన్ని కలిగి
ఉన్నాను,చాలా మంది ఇలాగే ఉంటారని నేను గట్టిగా భావిస్తున్నాను! షరతులు లేకుండా ప్రేమించే సపోర్టివ్ ఫ్రెండ్‌గా ఉండటం ద్వారా ఆమె ఈ ప్రయాణంలో మెయికి సహాయం చేస్తుంది’’అని మైత్రేయి రామకృష్ణన్ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి డోమీ షి,జూలియా చో చమత్కారంతో కూడిన సంభాషణలు రాయగా, లిండ్సే కాలిన్స్ నిర్మాతగా వ్యవహరించారు. మైత్రేయి రామకృష్ణన్‌తో పాటు, సినిమా పాత్రలకు రోసాలీ చియాంగ్, సాండ్రా ఓహ్, ఓరియన్ లీ, అవా మోర్స్, హైన్ పార్క్, వాయ్ చింగ్ హో, జేమ్స్ హాంగ్ తదితరులు గాత్రదానం చేశారు. ప్రియా,ఆమె స్నేహితులు తమ ‘టర్నింగ్ రెడ్’ క్షణాలను మార్చి 11వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు,మలయాళ భాషలలో అందుబాటులోకి వస్తోంది. స్వీయ అంగీకారం,నిజమైన స్నేహానికి సంబంధించిన మనోహరమైన కథను చూడండి.

error: Content is protected !!