365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 16,2025: ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఛానెల్ ఈ వారం మరో పక్కా వినోదాత్మక సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనుంది. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ అనే హాస్యభరిత ఎంటర్‌టైనర్ చిత్రం ఈ ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే కథలో కృష్ణగా సందీప్ కిషన్, అతని తండ్రి వెంకట రమణగా రావు రమేష్ నటించారు. కృష్ణకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో, తండ్రే ముందు పెళ్లి చేసుకుని కొడుకుకు వధువును చూపించాలని భావిస్తాడు.

ఇదే సమయంలో కృష్ణకు మీరా (రీతూ వర్మ), వెంకట రమణకు యశోద (అన్షు సాగర్) పరిచయమవుతారు. వీరి మధ్య చోటుచేసుకునే సంఘటనలు, సంఘర్షణలు, భవిష్యత్తు నిర్ణయాలు హాస్యానికి తోడుగా భావోద్వేగాలను పంచుతాయి.
ఈ చిత్రంలో మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న మజాకా, టీవీలో కూడా అలరించేందుకు సిద్ధంగా ఉంది. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు హృదయాన్ని తాకే క్షణాలతో కూడిన ఈ చిత్రాన్ని తప్పకుండా చూడమని జీ తెలుగు సూచిస్తోంది.
ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు… జీ తెలుగులో ‘మజాకా’ను మిస్ కాకండి!