365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,జనవరి 28,2026: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పెను ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపంతో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అజిత్ పవార్ తోపాటు మరొక నలుగురు మృతి చెందారు.

అజిత్ పవార్ కుటుంబ నేపథ్యం..
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అజిత్ పవార్ కుటుంబ విశేషాలు పరిశీలిస్తే.. అటు రాజకీయం, ఇటు వ్యాపార రంగాల్లో వారి కుటుంబం విస్తరించి ఉంది.

తండ్రి – తల్లి: అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్ (శరద్ పవార్ సోదరుడు). ఆయన ప్రఖ్యాత శాంతారామ్ స్టూడియోలో పని చేసేవారు. తల్లి ఆశాతాయ్ పవార్.

ఇదీ చదవండి..ఆకాశంలో ప్రమాదాలు: స్మాల్ ప్లేన్స్ కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నాయా..?

ఇదీ చదవండి..ఒత్తిడిని జయించే సరైన సింపుల్ టిప్స్ మీకోసం..!

సతీమణి సునేత్ర: అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ విద్యా సంస్థలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. ఆమె ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం (పదమసింహ పాటిల్ సోదరి) నుంచి వచ్చారు.

వారసులు: వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పార్థ్ పవార్ ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టగా, చిన్న కుమారుడు జయ్ పవార్ వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు.

తోబుట్టువులు: ఆయనకు శ్రీనివాస్ పవార్ అనే సోదరుడు ఉన్నారు.

ఇదీ చదవండి..అజిత్ పవార్ కుటుంబ నేపథ్యం ఇదే..

ఇదీ చదవండి..అజిత్ పవార్ విమానం కూలడానికి ముందు పైలట్ చేసిన చివరి హెచ్చరిక ఇదే..

ఎవరితో సాన్నిహిత్యం ఎక్కువ?

అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంలో తన బాబాయ్ శరద్ పవార్ తర్వాతే ఎవరైనా.

గురువుగా శరద్ పవార్: అజిత్ పవార్ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంది శరద్ పవార్ శిష్యరికంలోనే. రాజకీయంగా విభేదాలు వచ్చినప్పటికీ, కుటుంబ పరంగా శరద్ పవార్ పట్ల ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది.

పట్టుదల కలిగిన నేత: పరిపాలనపై పట్టు, తెల్లవారుజామునే పనుల సమీక్ష చేయడం అజిత్ పవార్ శైలి. అందుకే అధికారుల వర్గాల్లోనూ, కార్యకర్తల్లోనూ ఆయనకు ‘అజిత్ దాదా’గా విపరీతమైన క్రేజ్ ఉంది.

కుటుంబ బంధాలు: రాజకీయాల్లో సుప్రియా సూలేతో పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా వారి మధ్య సోదర అనుబంధం కొనసాగుతుంటుంది.