365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 2,2022: సేవ్ ది చిల్డ్రన్, ఇండియా (బాల రక్షా భారత్ అని కూడా పిలుస్తారు)కొవిడ్-19 బాలికలపై, అదీ ముఖ్యంగా నగరాల్లోని మురికివాడల్లో ఉంటున్న బాలికలపై చూపించిన
తీవ్ర ప్రభావాన్ని తన అధ్యయన- నివేదికలో పేర్కొంది. కొవిడ్-19తో మహమ్మారితో యువతులు ఎదుర్కొన్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించిన తన నివేదిక- ‘‘ది వరల్డ్ ఆఫ్ ఇండియాస్ గర్ల్స్ -వింగ్స్ 2022’’ను నేడు విడుదల చేసింది.

మహమ్మారి మొదటి అల అవధిలో అలాగే ఆ తర్వాత భారతదేశంలో విధించిన లాక్‌డౌన్‌ సందర్భంలో ఆడపిల్లల పరిస్థితులను ఈ నివేదిక తేటతెల్లం చేసింది. వారిని కొవిడ్-19 వైరస్‌కు సంబంధించిన పలు మ్యుటేషన్లు అలాగే తదుపరి అలలు మరింత కష్టాల పాలు చేసిందని నివేదిక పేర్కొంది.ఈ అధ్యయనం ఆడపిల్లలకు మొత్తం మీద వారికి అభద్రత కలిగిన సందర్భాల్లో అయిన మార్పులకు ప్రాధాన్యత ఇచ్చి వారి ఆరోగ్యం, విద్య,ఆటలు అలాగే మనోరంజనకు సంబంధించి అవకాశాల అందుబాటు పరిణామాలను వివరించింది. ఆరోగ్యం అలాగే పోషకాహార అభద్రతలు,
చదువుకునే అవకాశాలు ఒక్కసారిగా క్షీణించడం, బాల్య వివాహం చేసుకోవలసిన ఒత్తిడి,పరిమిత ఆటలు,వినోద సౌకర్యాలను ఎదుర్కొనేందుకు కుటుంబాలు అలవర్చుకునే విధానాలను అర్థం చేసుకోవడాన్ని ఈ నివేదికలో వివరించారు.

ఈ నివేదిక గురించి సేవ్ ది చిల్డ్రన్ సీఈఓ సుదర్శన్ సుచి మాట్లాడుతూ, “నేడు మనం బాలలను 100% సురక్షితంగా ఉంచకపోతే భారతదేశం@100 తన పూర్తి సామర్థ్యాన్ని సాధించడం సాధ్యం కాదు. వింగ్స్ 2022 నివేదిక మన దేశంలోని తన బాలలు అందరిపై పెట్టుబడి పెట్టకుండా,సురక్షితంగా ఉంచేందుకు ఎదురయ్యే సమస్యలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు మేము అనుసరించిన ఒక మార్గం.ప్రత్యేకించి,భారతదేశం @75లో దాదాపు సగం మంది పిల్లలు తమ ప్రాథమిక హక్కులతో తమను తాము ఇతరులతో సమానంగా రక్షించుకోలేకపోతున్నారనే అంశం ఒక చేదు నిజం! ఈ నివేదికతో, పరిష్కారంలో భాగం కావాలనే మా నిబద్ధతను మేము పునరుద్ఘాటించాలనుకుంటున్నాము.

వివిధ నిర్దిష్ట దశలతో పాటు, నివేదిక మనందరికీ ముందుకు వెళ్లేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. మరీ ముఖ్యంగా, బాలల గళాన్ని అందరికీ చేర్చేందుక బాధ్యత తీసుకుంటోంది- ప్రాథమిక వాటాదారులు – వారి కోసం ప్రణాళికా ప్రక్రియ నుంచి వారితో ప్రణాళిక రూపొందించుకునే విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తుంది. బాలల్ని ఎక్కువ సమయం వేచి ఉండేలా చేయడం సాధ్యం కాదు!’’అని పేర్కొన్నారు.యుక్తవయసులోని బాలికల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించడానికి వారి గళాన్ని కూడా ఈ అధ్యయనం సహకరించింది. ఇది #allyoupforher భాగస్వాముల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన పరిష్కారాలను చూపించవలసి అవసరాన్ని ఇది చాటి చెప్పింది.

ఇది విధాన రూపకర్తలు అలాగే చట్టాలను జారీ చేసేవారు దీర్ఘావధి ప్రణాళిక చర్యలను చేపట్టడం ద్వారా యువతుల రక్షించేందుకు అలాగే వాటి గురించి వ్యూహాలను రూపొందించుకునేందుకు సన్నద్ధం అయ్యేందుకు అవకాశం కల్పించింది.సమర్థవంతమైన,విస్తృతమైన మార్పులు తీసుకు వచ్చే ఈ అధ్యయనం నాలుగు- లక్ష్యంతో,నాలుగు ప్రాంతాలు- ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్,తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించగా, నాలుగు భౌగోళిక మండలాలకు (తూర్పు, పశ్చిమం, ఉత్తరం,దక్షిణం) ప్రాతినిధ్యం వహించేలా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. నివేదిక చేసిన ప్రముఖ సిఫార్సులు ఇలా ఉన్నాయి:
*బాలికలపై పెట్టుబడుల పెంపు: కొవిడ్-19 మహమ్మారి,దాని పర్యవసానాలు త్వరలో బాలికల జీవితాలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసుకుని, బాలికల అవసరాల పరిష్కారానికి పెట్టుబడులను పెంచడంతో పాటు ఆరోగ్యం, పోషణ, విద్య,రక్షణ సేవలను వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవలసి ఉంది. బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి చక్కని వనరులను సమకూర్చుకోవలసి ఉంటుంది.
* వివిధ-భాగస్వాములతో ఎంగేజ్‌మెంట్‌ను వృద్ధి చేసుకోవడం: బాలికల హక్కుల ఉల్లంఘన సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర, పౌర సమాజ సంస్థలు, ప్రైవేటు రంగం, విద్యాసంస్థలు,మీడియా, సముదాయం, పౌరులు,బాలికలు కలిసి పనిచేసేందుకు అవసరమైన సమన్వయం,సమన్వయ ప్రయత్నాలు అవసరం.
*బాలికల స్వరాన్ని ఆలకించండి: బాలికలు ఆయా సేవలను తేలికగా అందుకునేలా సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రతిస్పందన ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి వారి అనుభవాన్ని మరియు కొవిడ్-19 ప్రభావాన్ని తెలుసుకునేందుకు బాలికలతో మాట్లాడడంతోనే వారికి పరిహార సేవలను అందించేందుకు అవకాశం ఉంటుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
*బాలికల ఏజెన్సీని రూపొందించడం: బాలికల ఏజెన్సీని నిర్మించడం (i) బాలలకు మెరుగైన సేవలు,రక్షణ యంత్రాంగాల పనితీరు కోసం ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సమన్వయం కలిగి ఉండడం (ii) బాలలు,యువత నేతృత్వంలోని అడ్వకసీకి అవకాశాలను సృష్టించడం ద్వారా వారి జీవిత లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు వారికి సాధికారత కల్పించడం,బాల్య వివాహాలతో సహా బాలల హక్కుల సమస్యలపై బాధ్యత కలిగి ఉండేలా చేయడం,(iii) బాలల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు, వారి సముదాయాల్లోని బాలల కోసం చేపట్టే కార్యకలాపాలకు నేతృత్వం వహించేందుకు బాలల సమూహాలు, యువజన సమూహాలు మరియు ఇతర ఫోరమ్‌లను వినియోగించుకోండి.
*వితరణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం: బాలికల కోసం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు డెలివరీ మెకానిజమ్‌లను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది.

*సంస్థలు, నిర్మాణాలు,ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఆర్థిక, సామర్థ్యాన్ని పెంపొందించడం,ద్వారా బాలల హక్కులను పెంపొందించేందుకు ,బాలలకు ఉత్తమ ప్రయోజనాలను పెంపొందించేందుకు బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులను ప్రేరేపించడం,విద్యావంతులను చేయడం,వారిని అందుకు అంగీకరించేలా చేయడం ద్వారా చురుగ్గా పనిచేసేందుకు ప్రోత్సాహకాలను అందించడం తదితర అంశాలలో ముఖ్యంగా యువతులకు అదనపు మద్దతును అందించండి.
* ఇతర ప్రయత్నాలలో సీపీసీ (CPC), (VHSNC) తదితర వార్డు/గ్రామం/గ్రామ
పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేయబడిన వివిధ కమిటీల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు సముదాయ-ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం ,అభివృద్ధి చేయడం.
* ఆడపిల్లలపై సాక్ష్యాలను రూపొందించడం: బాలికలపై కొవిడ్-19 చూపించిన ప్రభావాలకు సంబంధించిన సాక్ష్యాలను రూపొందించడంలో పెట్టుబడి పెట్టండి. కొవిడ్-19 నేపథ్యంలో బాలికలపై డేటాను రూపొందించే ప్రయత్నాల్లో ఆరోగ్యం, పోషకాహారం, విద్య,బాలల రక్షణతో సహా అన్ని క్లిష్టమైన బాలల హక్కుల సమస్యలపై నిర్దేశించబడాలి.అంగన్‌వాడీ కేంద్రాలు,పాఠశాలలకు బాలలు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు సేవ్ ది చిల్డ్రన్,ఇండియా రూపొందించిన నిర్మాణాత్మక మార్గదర్శకాలు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖలతో పాటు తరగతుల వారీగా టైమ్‌టేబుల్,
వ్యవధితో సహా సురక్షిత రిటర్న్ ప్రోటోకాల్‌లతో పంచుకున్నారు.

సదస్సులు, భద్రతా విధానాలు(అంటే, ప్రతి తరగతి తర్వాత తరగతి గదులను శుభ్రపరచడం,వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) కిట్‌ల ఏర్పాటు) అనుసరించాల్సినవి ,కొవిడ్-19 కేసులు బయటపడితే, తిరిగి కోర్సు దశలను ఇందులో పేర్కొన్నారు.

మొదటిసారి 2014లో వింగ్స్ విడుదల చేసిన తన నివేదికలో ఆర్థిక వృద్ధి,సామాజిక
అభివృద్ధి ఉన్నప్పటికీ బాలికలు,మహిళలు ఎదుర్కొంటున్న అసమాన సవాళ్లను అన్వేషించింది. కాగా, వింగ్స్ 2018 తన నివేదికలో అంతర్లీనంగా ఉన్న లింగవివక్ష మూస పద్ధతులను,బహిరంగ ప్రదేశాల్లో బాలికల భద్రతపై చూపిస్తున్న ప్రభావాలు, వారి సామర్థ్యాన్ని గుర్తించడంలో ఉన్న అడ్డంకుల గురించి పేర్కొంది.