ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నోపద్మా కమలాకర్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి22,2024:ప్రతి విద్యార్థి తన మనసుతోనే స్నేహం చేస్తే మేధావులు కావచ్చని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నోపద్మా కమలాకర్ అన్నారు.
ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవతరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు.ఆమె మాట్లాడుతూ కంప్యూటర్ లో కీబోర్డ్, మౌస్ ఉపయోగించినట్లే… పంచేంద్రియాలు,ఊహాశక్తితో మానవ మేధస్సును ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చన్నారు.
విద్యార్థులు జీవితలక్షాన్ని నిర్దేశించుకుంటే దానికనుగుణంగా మేథస్సు సమీకృతం చేసుకోవచ్చన్నారు.న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్.ఎల్.పి) ఆధారంగా అదేవిధంగా సాధ్యమో ఆచరణాత్మకంగా విద్యార్థులకు నేర్పించారు.భవిష్యత్ పట్ల ఆకాంక్ష చదువుపై ఆసక్తి, ఏకాగ్రత ను ఏర్పరుస్తుందన్నారు.
తద్వారా గ్రహణశక్తి పెరిగి జ్ఞాపకం వుంచుకోగల్గుతారన్నారు. అధిక సమయం విరామం లేకుండా చదివితే మెదడు లో ఆక్సిజన్, గ్లూకోజ్ స్థాయిలు తగ్గి గ్రహణం సామర్థ్యం సన్నగిల్లుతుందన్నారు.అందుకే ప్రతి 45 నిముషాలకు పది నిమిషాలు విరామం ఇవ్వాలన్నారు.
ఆ విరామంలో పుస్తకం మూసి అప్పటి వరకు చదివిన విషయాలను నెమరు వేసుకోవాలన్నారు. అలా ఆ విషయాలు వచ్చేదాకా చదవాలన్నారు. అనంతరం 7రోజులకు,21రోజులకు,42 రోజులకు పునశ్చరణ చేస్తే శాస్వతంగా జ్ఞాపకం వుంటాయన్నారు.
పరీక్షలంటే భయానికి కారణం… తాము నేర్వని విషయాలు పరీక్షా పత్రం లో వస్తాయేమోనన్న అనుమానమేనన్నారు. ఎంత మేధావులైనా తమకు తెలియని విషయాలు చెప్పడం, రాయడం చేయలేరన్నారు. తాము నేర్చిన మేరకు పరీక్ష పత్రంలో ఏమిచ్చినా రాయగలనన్న విశ్వాసంతో విద్యార్థులు పరీక్ష భయాన్ని అధిగమించవచ్చన్నారు.
మనుషుల అంతర్గత శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించే మనో విజ్ఞానమే “హిప్నాటిజం” అన్నారు. సూచనలతో మానసిక, శారీరక స్థితిగతులను, సామర్థ్యాలను ప్రేరేపించవచ్చని ఆచరణాత్మకంగా చేసి చూపించారు. తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు సినిమా అనుకోని పరీక్షలకు వెళ్లాలన్నారు. ఇంకొకరితో పోల్చుకోవడం చేయకోడదన్నారు.
ఎవరి శక్తి సామర్థ్యాలు వారివే నన్నారు. ఎలా, ఎప్పుడూ చదవాలో టెక్నిక్స్ ద్వారా ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ ఎం మైండ్.స్వరుపా, ఉపాధ్యాయులు,80 మంది పదవతరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారికి పుస్తకాలు స్నాక్స్ అందజేసారు.