365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 16,2022: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధ‌వారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై విహ‌రించారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.