Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 25,2024: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 2024, ఫిబ్రవరి 25న ఉదయం‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య, సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతారావు విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను విద్యార్థులు చాలా శ్రద్ధతో విన్నారు.

దేశాభివృద్ధి కోసం ప్రధాని ప్రారంభించిన పలు సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలపై ఈ చర్చ జరిగింది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం 2014 నుంచి నిర్విరామంగా ప్రధాని కొనసాగిస్తున్నారు.

మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన, పెట్టబోయే పథకాలపై కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ ఏడాదిలో ఇది రెండో మన్ కీ బాత్ కార్యక్రమం. ప్రతిసారి ఈ కార్యక్రమం మొత్తం 22 భారతీయ భాషల్లో ప్రసారమవుతుంది.

అలాగే 29 మాండలికాల్లోనూ ప్రజలకు చేరువ అవుతుంది. అంతటి విశిష్టమైన ఈ కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (కేంబ్రిడ్జ్) క్యాంపస్ లో ప్రత్యక్ష ప్రసార స్క్రీనింగ్ చేయగా, విద్యార్థులు చాలా ఆసక్తిగా వీక్షించారు.


ఈ సందర్భంగా మల్కా కొమరయ్య మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు. అలాగే ప్రజా ప్రతినిధి కూడా. అందుకే దేశప్రజలందరికీ చేరువవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించి, ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుంటారు.

ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము మా విద్యార్థులతో వీక్షించడం ఆనందంగా ఉంద’’ని అన్నారు. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని శ్రీమతి సునీతా రావు అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

error: Content is protected !!