Thu. Dec 5th, 2024
Lagnam_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 22, 2023: లగ్నం స్టూడియో ఆధారిత లగ్జరీ వెడ్డింగ్ డెస్టినేషన్ స్టోర్ బంజారాహిల్స్‌లో ప్రారంభమైంది. ఈస్టోర్ ను తెలంగాణ పోలీస్ ట్విన్ టవర్స్‌ పక్క లేన్‌లో ఏర్పాటుచేశారు.

ఈ కొత్త షోరూమ్ పేరు ‘లగ్నం’ (వివాహం) భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేందుకు నిర్వాహకులు ముస్లింలైనా కానీ అలా పేరు పెట్టి తమ మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఇది స్టూడియో ఆధారిత లగ్జరీ వెడ్డింగ్ డెస్టినేషన్ స్టోర్.

తాము అన్ని మతాలు సమానమని నమ్ముతామని ‘లగ్నం’ నిర్వాహకులు ఆరిఫ్ ఖాన్ తెలిపారు. ఇది మక్దూమ్ బ్రదర్స్ కు చెందిన 3వ స్టోర్. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, ఒకసారి శాసనసభలో మక్దూమ్ బ్రదర్స్ గురించి ప్రస్తావించారు, జాతి దుస్తులలో వారి ప్రత్యేకత వారి సుదీర్ఘ చరిత్ర గురించి ప్రశంసించారు.

Lagnam_365

బంజారాహిల్స్ లో 6,400 చదరపు అడుగుల స్టోర్ లో వధూవరుల కోసం అనేక రకాల డిజైనర్ వేర్ ను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. హ్యాండ్ పెయింటెడ్ షేర్వానీలు, లైట్ వెయిట్ షేర్వాణీలు, లెహంగాలు, చీరలు, ఆభరణాలు,

హ్యాండ్‌క్రాఫ్టెడ్ షూస్, డైమండ్-స్టడెడ్ కఫ్‌లింక్‌లు అండ్ షేర్వానీ బటన్‌లు వంటివి కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్ అందుబాటులో ఉందని స్టోర్ పార్ట్‌నర్స్ అండ్ బ్రదర్స్ ఆరిఫ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ లు తెలిపారు.

లగ్నం కొన్ని ప్రత్యేకమైన షేర్వాణీలను అందిస్తుంది. అందులోభాగంగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న సూపర్ 120 ఫాబ్రిక్‌తో డిజైనర్ షేర్వానీ తయారు చేసింది. దీనిపై చేతితో పెయింట్ వేశారు.

దీని ధర రూ. 24,500/. ఇలాంటి ఎత్నిక్ వేర్ లో 5 లక్షల వరకు పలురకాల డిజైన్స్ ఉన్నాయి. క్వాలిటీ లెదర్ ను ఉపయోగించి, చేతితో కుట్టిన బూట్లు ఉన్నాయి. వీటి ధర జత రూ. 12,500గా ఉంది.

షేర్వాణీలు పురుషులకు సాంప్రదాయక వస్త్రధారణలు. రాయల్టీ, గాంభీర్యం, శైలి సొగసైన స్వరూపం కలిగిఉంటాయి. పెళ్లి సమయంలో వధువు చీరకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పురుషులవిషయంలో కూడా అంతే సమానంగా షేర్వాణీలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇది రాయల్టీగా కనిపిస్తుంది.

వివాహాలు, పండుగలు, నిశ్చితార్థాలు, కుటుంబ సమావేశాలు, సాంప్రదాయ ఆచారాలు, వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలలో పురుషులు దీనిని ధరిస్తారు. అచ్కాన్‌లను చాలా మంది భారతీయ వరులు వివాహ దుస్తులుగా ధరిస్తారు. ముఖ్యంగా హైదరాబాదీ ముస్లింలు పెళ్లిళ్లకు వీటిని ధరించడానికి ఇష్టపడతారు.

ఇవి బ్రిటీష్ ఫ్రాక్ కోట్‌తో షేర్వానీ కమీజ్ కలయికగా ఉద్భవించాయని చెబుతారు.వీటిని ముస్లిం ప్రభువులకు చిహ్నంగా భావిస్తారు. ఇవి భారతదేశంలోని రాజ కుటుంబీకుల దుస్తులు. సాంప్రదాయకంగా ముస్లిం ప్రభువులతో ముడిపడి ఉంటాయి ఇవి.

లగ్నం అనేది1888లో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన135 ఏళ్ల మక్దూం బ్రదర్స్ హౌస్ నుంచి 3వస్టోర్, వీరు పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర పాలకులు నిజాంలకు దుస్తులు అందించేవారు.

మక్దూమ్ బ్రదర్స్ భారతదేశంలో వివాహ షేర్వాణీలను అత్యధికంగా విక్రయించేవారిలో ఒకరు. 135 సంవత్సరాలకు పైగా సాగిన ప్రయాణంలో తమ వివాహాలకు రెండు లక్షల మందికి పైగా దుస్తులు ధరించడం వారి ప్రత్యేకత.

ప్రముఖులకు కూడా.. డిజైనర్ షేర్వానీలు..

Lagnam_365

ప్రముఖులకు కూడా డిజైనర్ షేర్వానీలు అందించిన ఘనత వీరిది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు జోధ్‌పురి, షేర్వాణీలను బహుకరించినట్లు చెబుతున్నారు.

అంతేకాదు మాజీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో ఎంబెకీ, సానియా మీర్జా పెళ్లి సమయంలో ఆమె భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్ కు కూడా మక్దూమ్ బ్రదర్స్ షేర్వాణీలను బహుకరించారు.

error: Content is protected !!