365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్11,2023: సోమవారం స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మొదటిసారి 20,000 మైలురాయిని అందుకుంది. అంతకు ముందున్న 19,991 గరిష్ఠ స్థాయిని దాటేందుకు 36 సెషన్లు తీసుకుంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి.
జీ20 సమావేశాల్లో భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ మీదుగా రహదారికి ఆమోదం రావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. దీనికి తోడు బ్యాంకింగ్, మెటల్ సెక్టార్లు సూచీకి ఊతం అందించాయి. మొత్తంగా నిఫ్టీ 176, సెన్సెక్స్ 528 పాయింట్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 83.03 వద్ద స్థిరపడింది. చైనా మినహా అన్ని దేశాల సూచీలు ఎరుపెక్కాయి.
క్రితం సెషన్లో 65,598 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,807 వద్ద మొదలైంది. 65,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని చివరికి 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,890 వద్ద ఓపెనై 19,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,008 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 176 పాయింట్లు పెరిగి 19,996 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 414 పాయింట్లు ఎగిసి 45,636 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 46 కంపెనీలు లాభపడగా 4 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ (7.10%), అపోలో హాస్పిటల్స్ (2.18%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (3.68%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), పవర్ గ్రిడ్ (2.18%) టాప్ గెయినర్స్. కోల్ ఇండియా (1.15%), బజాజ్ ఫైనాన్స్ (0.28%), ఓఎన్‌జీసీ (0.27%), ఎల్‌టీ (0.18%) టాప్ లాసర్స్.
మీడియా మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. కెనరా బ్యాంక్, పీఎస్‌బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహా బ్యాంకు, యూకో, సెంట్రల్ బ్యాంకు షేర్లు 4-6 శాతం ఎగియడంతో పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంకు రంగాల సూచీలు పెరిగాయి. వీటికి తోడుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు లభించడంతో నిఫ్టీ దూసుకెళ్లింది.
నిఫ్టీ సెప్టెంబర్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,990 వద్ద సపోర్ట్, 20050 వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు కొటక్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, ఎస్బీఐ, సుందర్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హీరో మోటార్స్ షేర్లు కొనుగోలు చేయొచ్చు.
నిఫ్టీ 19,000 నుంచి 20,000 మార్కును చేరుకోవడానికి 52 సెషన్లు పట్టింది. మిడ్‌క్యాప్ సూచీ రికార్డు స్థాయిలో 41,400 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్లకు పెరిగింది. సోమవారం ఒక్కరోజే 3.5 లక్షల కోట్లకు ఎగిసింది.
చివరి ఏడు నెలలతో పోలిస్తే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ11 లక్షల కోట్లకు పెరిగింది. ఈక్విటీ పెట్టుబడుల పెరగడంతో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వంటి స్టాక్స్ ఐదు శాతం పెరిగాయి.
హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు రూ.82.6 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఎన్టీపీసీ కౌంటర్లో 49 లక్షల షేర్లు చేతులు మారాయి. ఐఆర్‌ఎఫ్‌సీలో 1.29 కోట్ల షేర్లు చేతులు మారాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709