Sat. Nov 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 22,2023:కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన అత్యంత ప్రసిద్ధ కారు ఆల్టో కె10ని కొత్త ఫీచర్లతో విడుదల చేస్తోంది. ఈ కొత్త కారు త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. డీజిల్ ,పెట్రోల్ ఇంజన్‌లతోపాటు సీఎన్జీ వెర్షన్ కూడా ఉంటుంది. ఆల్టో కె10ని మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కారును తయారు చేశారు.

ఫీచర్లు..

Alto K10లో కొన్ని అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో, సింగిల్ పాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్, ప్రీమియం ఆడియో, సిస్టమ్ వాయిస్ అసిస్టెంట్, సపోర్ట్ డిజిటల్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్స్ ఉంటాయి. మారుతి ఆల్టో కె10లో,55 బిహెచ్‌పి పవర్,130ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల స్ట్రాంగ్ 998సిసి ఇంజన్‌ కలిగి ఉంది.

పెట్రోల్,డీజిల్ అలాగే CNG తో..

ఈ కారును పెట్రోల్,డీజిల్‌తో పాటు CNGలో కూడా ఉంటుంది. భద్రత పరంగా, ఈ కారు NCAP నుంచి 2 స్టార్ రేటింగ్‌ పొందింది. ఈ కారులో 25 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.

డీజిల్, CNG ఇంజన్లకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మూలాల ప్రకారం, ఈ కారును ఐదు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఒక్కో వేరియంట్ కు ఒక్కో రకమైన ధర ఉంటుంది. అదే కారు, ప్రారంభ ధర రూ.4.30X ఎక్స్-షోరూమ్ అయితే టాప్ మోడల్ ధర రూ.6.30X ఉండొచ్చు.

error: Content is protected !!