365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, జూన్ 3, 2023: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి కొరత ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం సెమీకండక్టర్ల సరఫరాలో అవరోధం కారణంగానే లక్షలాది ఆర్డర్లను పెండింగ్ లో ఉంచింది.
అంతేకాదు ఇప్పటికే చిప్ కొరత కారణంగా కంపెనీ 1.7 లక్షల యూనిట్ల ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుతం 4 లక్షలకు పైగా యూనిట్ల బకాయిలు సరఫరా కంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది. మారుతి సుజుకి ఎర్టిగా సుమారు లక్ష యూనిట్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏప్రిల్‌లో కూడా తమ కంపెనీ ఉత్పత్తి తక్కువగానే ఉందని అన్నారు.
మే, జూన్ నెలల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా చేస్తున్నారు. ఎర్టిగా ఎమ్‌పివికి సుమారు లక్ష యూనిట్ల ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఉండగా, జూన్ 2022లో ప్రారంభించిన కొత్త-జెన్ బ్రెజ్జాకు కూడా కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
త్వరలో విడుదల కానున్న జిమ్నీ లైఫ్‌స్టైల్ ఆఫ్ రోడ్ SUV, Franks కాంపాక్ట్ SUV కూపే ఇప్పటి వరకు 30,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి.
ఆల్-ఎలక్ట్రిక్ suv
Fronx కొన్ని నెలల క్రితం ప్రారంభించింది. జూన్ 7న జిమ్నీ ఆఫ్-రోడ్ SUV రెండు వేరియంట్‌లలో ,తదుపరి రెండు నెలల్లో బ్యాడ్జ్-ఇంజనీరింగ్ ఇన్నోవా హైక్రాస్‌ని అనుసరించనుంది. రాబోయే రెండేళ్లలో, కంపెనీ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఏడు సీట్ల గ్రాండ్ విటారా దాని మొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది.