365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 5, 2025 : భారతీయ SUV మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) సిద్ధమైంది.

సరికొత్త SUV విక్టోరిస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధునిక కాలానికి తగ్గ ఫీచర్లు, అత్యుత్తమ భద్రత, విలాసవంతమైన సౌకర్యాలు, విభిన్న పవర్ ట్రైన్ ఆప్షన్లతో ఈ SUV “అన్నీ కలిగి ఉన్న” (Got It All) అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అత్యాధునిక టెక్నాలజీ..

10.1 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో X టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలెక్సా ఆటో వాయిస్ AI, OTA అప్‌డేట్స్, 8-స్పీకర్ల ఇన్ఫినిటి డాల్బీ అట్మోస్ 5.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, జెస్చర్ కంట్రోల్‌తో పవర్డ్ టెయిల్‌గేట్, 64- రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు.

అపూర్వ భద్రత: లెవెల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, 11 వ్యూస్‌తో హై-డెఫినిషన్ 360 డిగ్రీ కెమెరా.

కనెక్టెడ్ టెక్నాలజీ: eCall, 60+ ఫీచర్లతో కూడిన సుజుకీ కనెక్ట్ టెలిమాటిక్స్.

విభిన్న పవర్ ట్రైన్స్: EV మోడ్‌తో స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్-గ్రిప్ సెలెక్ట్ (4X4), స్మార్ట్ హైబ్రిడ్‌తో 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజన్, S-CNG టెక్నాలజీతో కూడిన అండర్-బాడీ CNG ట్యాంక్ డిజైన్.

మారుతి సుజుకీ ఇండియా MD & CEO హిసాషి టకేచి మాట్లాడుతూ, “నేటి ఆధునిక యువతకు తగ్గట్టుగా, టెక్నాలజీ, భద్రత, పర్యావరణ స్పృహతో విక్టోరిస్ ను రూపొందించాము. ఇది కచ్చితంగా ‘గాట్ ఇట్ ఆల్’ SUV అవుతుంది” అని తెలిపారు.

బుకింగ్..

విక్టోరిస్ ను రూ. 11,000 ప్రారంభ చెల్లింపుతో మారుతి సుజుకీ ARENA షోరూమ్‌లలో లేదా వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త SUV, యువతరం అభిరుచులకు అనుగుణంగా, అధునాతన డిజైన్, శక్తివంతమైన పనితీరు, అత్యుత్తమ ఫీచర్లతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది.