Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగష్టు 29,2023: భారత మార్కెట్లో కొన్ని కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కార్లు షోరూమ్‌లలోకి వచ్చిన వెంటనే అమ్ముపోతాయి. గత నెలలో కూడా ఈ కార్లు కొనుగోలు బాగా జరిగినవి. ఈ మోడల్ కార్లు కావాలని దీనిని కొనుగోలు చేయలని ఆలస్యం చేసిన కొనుగోలుదారులకు కంపెనీ విచారం వ్యక్తం చేసింది.

ఈ కారు మంచి ఇంజన్ పనితీరు ,మైలేజీ కారణంగా చాలా ఎక్కువ కార్లు అమ్ముడవుతాయి . గత నెల విక్రయాలను పరిశీలిస్తే, మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 కారు. జూలై 2023లో కంపెనీ 17,896 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది. అదే నెలలో బ్రెజ్జా, బాలెనో ,ఎర్టిగా గట్టి పోటీనిచ్చాయి.

కంపెనీ మారుతి స్విఫ్ట్‌ను LXi, VXi, ZXi ,ZXi+ అనే నాలుగు వేరియంట్‌లలో విక్రయిస్తోంది. దీని ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. CNG ఎంపిక దాని VXi ,ZXi ట్రిమ్‌లో కూడా అందుబాటులో ఉంది.

మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 90 PS పవర్,113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంటుంది. స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌లో 22 kmpl, CNG వేరియంట్‌లో 30.90km/kg మైలేజీని అందిస్తుంది. ఈ కారులో 268 లీటర్ల బూట్ స్పేస్ ఇవ్వనుంది.

ఫీచర్లు..

మారుతి స్విఫ్ట్ ఫీచర్ల పరంగా కూడా చాలా అప్‌డేట్ చేసింది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC, LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్లు ఇందులోని కొన్ని ముఖ్య ఫీచర్లు.

భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),వెనుక పార్కింగ్ సెన్సార్‌లను పొందుతుంది.

మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.6 లక్షలు

భారతీయ మార్కెట్లో, మారుతి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్లతో పోటీపడుతుంది. మీరు స్విఫ్ట్‌ను మూడు డ్యూయల్-టోన్,ఆరు మోనోటోన్ ఎక్స్‌టీరియర్ షేడ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆగస్ట్ 2023లో, మారుతి స్విఫ్ట్‌లో రూ. 60,000 ఆఫర్‌లు కూడా అందించబడుతున్నాయి. మీ బడ్జెట్ 6-8 లక్షల రూపాయల మధ్య ఉంటే, మారుతి స్విఫ్ట్ మీకు మంచి కారు అని నిరూపించవచ్చు.

error: Content is protected !!