South-Asian-superhero
South-Asian-superhero

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 9, 2022: మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌ (MCU)లోకి సరికొత్త ప్రవేశంగా డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)పై మార్వెల్‌ స్టూడియో సూపర్‌ హీరో– స్టార్‌– కట. క్చటఠ్ఛిజూ జన్మించింది. కమలా ఖాన్‌ ఉరఫ్‌ Ms. Marvelగా నూతన నటి ఇమన్‌ వెల్లానీ నటించారు. ఆమె మార్వెల్‌ మొట్టమొదటి దక్షిణాసియా మహిళా సూపర్‌ హీరోగా నిలిచారు. హైస్కూల్‌లో టీనేజర్‌ అయిన కమల, అద్భుతమైన ఊహలు కలిగిన చక్కటి గేమర్‌. ఇతర టీనేజర్లలాగానే ఆమె కూడా కెప్టెన్‌ మార్వెల్‌కు అభిమాని. ఆమె అభిమానం ఇప్పుడు అనూహ్య మలుపు తీసుకోవడంతో పాటుగా సూపర్‌పవర్స్‌ను ఆమె కనుగొని తన హీరోలా మారింది. న్యూజెర్సీలో తీర్చిదిద్ధిన Ms. Marvel లో అత్యుత్తమ భాగం ఏమిటంటే కమల తన సూపర్‌ పవర్స్‌ను కనుగొనడం.Ms. Marvel ప్రీమియర్‌ దాని సొంత స్వరాన్ని రూపొందించు కుంది.

South-Asian-superhero


ఇందుకు ఇమాన్‌వెల్లానీకి ధన్యవాదాలు. ఎంసీయులో ఇమాన్‌ వెల్లానీలా ఆన్‌–పాయింట్‌ కాస్టింగ్‌ జరగకపోవచ్చు. సూపర్‌ హీరోయిజానికి తాజా విధానం తీసుకువస్తూ వెల్లానీ, ఆతృత కలిగిన టీనేజర్‌గా ఇన్‌స్టెంట్‌గా సౌకర్యం అనుభవిస్తుంది. క్యారికేచర్‌లా మారకుండా పాత్ర డోర్కీ లక్షణాలతో మమేకమయింది. ఆమె తాను ఈ విశ్వానికి కామిక్‌ బుక్‌ నుంచి నేరుగా వచ్చినట్లుగా భావిస్తుంది. సూపర్‌హీరోలలో కనిపించిన ట్లుగా ఆమె కళ్లలో ఆ మెరుపు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. పాకిస్తానీ,దక్షిణాసియా సంస్కృతి, విలువలను సైతం ఈ యువ కథానాయిక ద్వారా చక్కగా ప్రదర్శించారు. ఆమె తన శక్తులను సంస్కృతి ప్రత్యక్ష అనుభవాలతో అత్యద్భుతమైన చిత్రణ ద్వారా ప్రదర్శించారు. ఆకట్టుకునే యానిమేషన్‌ మాస్టర్‌ఫుల్‌ లైవ్‌ యాక్షన్‌ల సౌకర్యవంతమైన కలయికతో ఈ సిరీస్‌ విజువల్స్‌ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. వైవిధ్యతను మరింతగా పెంపొందిస్తూ సుప్రసిద్ధ తారలు అయినటువంటి భారతీయ ఫిల్మ్‌మేకర్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌, పాకిస్తానీ సూపర్‌స్టార్‌ ఫవాద్‌ ఖాన్‌ సైతం త్వరలో విడుదల కానున్న Ms. Marvel ఎపిసోడ్స్‌లో మోహన్‌ కపూర్‌, సాగర్‌ షేక్‌, నిమ్రా బుచాలతో పాటుగా కనిపించనున్నారు.

South-Asian-superhero

కేవలం నటులు మాత్రమే కాదు, దీని బృందం మొత్తంలోనూ దక్షిణాసియా ప్రాతినిథ్యం ఉంది. ఈ సిరీస్‌ క్రియేటర్‌ బ్రిటీష్‌–పాకిస్తానీ బిషా కె అలీ. దర్శకుడు అదిల్‌ ఎల్‌ అర్బీ,బిలాల్‌ ఫల్లాహ్‌, మీరా మోహన్‌ తో పాటుగా రెండుసార్లు అకాడమీ అవార్డు విజేత షర్మీన్‌ ఒబైద్‌ చినాయ్‌ సైతం ఉన్నారు. Ms. Marvel మరింత ఆశాజనకంగా ఉండటంతో పాటుగా రాబోయే ఎపిసోడ్స్‌లో కమల కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.