Fri. Nov 22nd, 2024
health chekup_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 30,2023: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమం నేడు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాలమేరకు మహిళా జర్నిలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

శ్రీరామ నవమి సందర్బంగా నేడు, గురువారం సెలవు దినమయినందున ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని,రేపు శుక్రవారం నుండి తిరిగి యదావిధిగా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 9 వ తేదీ వరకు (ఏప్రిల్ 2 వ తేదీ ఆదివారం మినహా ) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.

health chekup_365

ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి.

స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని, ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

error: Content is protected !!