365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,జూన్ 28,2024: ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ వ్యవస్థ కబ్జాకు పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పేరుమోసిన జర్నలిస్టులు సైతం చేతులుకలుపుతున్నట్లు వినికిడి.
ఐతే కేబుల్ వ్యవస్థ కబ్జా చేసేందుకు తెరవెనుక మాస్టర్ ప్లాన్ చేస్తోంది మీడియా లెజెండ్. దీనికి కావాల్సిన డబ్బు సమకూర్చుతోంది ఒక రాజకీయ నాయకుడు అని సమాచారం.
కీలక పార్టనర్ గా ఓ కీలక నేత పీఏ ఉండేందుకు ప్లాన్ రెడీ అయింది. వీరంతా అతనును కలిసి సమాలోచనలు చేశారు. ఇందుకు వైసీపీ నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు సహకారం అందిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే అతనినికలసిన బొకే కూడా సమర్పించి వచ్చాడు.
ప్లాన్ లో భాగంగా తొలిగా చానల్స్ ను బాయ్ కాట్ చేస్తారు. ఆ పని స్టార్ట్ అయింది. పబ్లిక్ ఎక్కువ మంది చూసే ఛానల్స్ ఆగిపోవటం వల్ల కేబుల్ ఆపరేటర్స్ కి నష్టం వస్తుంది.. నష్టాల్లో మీరు నడపటం కష్టం అని చెప్పి మెల్ల మెల్లగా వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఏపీలో 60 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 40 లక్షల కనెక్షన్లపై వారి కన్నుపడింది.
మాట వినని వాళ్ల నుంచి బలవటం గా స్వాధీనం చేసుకోవాలని కూడా డిసైడ్ చేసారు. ఇలా కేబుల్ కంట్రోల్ లో ఉంటే న్యూస్ చానల్స్ తమ నియంత్రణలో ఉంటాయని పెద్దలను ఒప్పించి పావులు కదుపుతున్నాడు ఒక జర్నలిస్టు. ఇవన్నీ చేసిపెట్టినందుకు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ ను కూడా తనకు అప్పగించాలని కోరాడు.
ఏపీలోను కేబుల్ మోనోపోలికి చేయాలని వీళ్ల కుట్ర. దీంతో ఇక చిన్నా చితకా ఆపరేటర్లు మటుమాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కొందరికి తృణమో.. పణమో ఇచ్చి అతి త్వరలో స్వాదీనం చేసుకోబోతున్నారు. ఇటీవల హాత్ వే రాజశేఖర్ చెందిన కేబుల్ నీ అతి చోకగా కొట్టిసిన తరహాలోనే ఇవన్ని చేయాలన్నది వీళ్ల ప్లాన్.
కేబుల్ చేతిలో ఉంటే ఛానల్ అన్నిటిని తమకు ఇష్టమైన తరహాలో కంట్రోల్ లో పెట్టవచ్చు అని ఒక జర్నలిస్టు ఇచ్చిన సలహా అందరికీ నచ్చింది అని అమరావతి లో టాక్. ఏపీ కేబుల్ వ్యవస్థ వశమవుతోంది. ఇప్పటికే ఈ విషయం బయటికి రావటంతో బాబుకి కంప్లైంట్ చేసేందుకు కొందరు కేబుల్ ఆపరేటర్స్ రెడీ అయ్యారు.