Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 7,2022:చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు,అలాంటి వ్యాపారాలను స్టాపించేవాళ్లు భారత ఆర్థిక వ్యవస్థ మూలస్తంభాలుగా ఉన్నారు. అయితే మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, ముఖ్యంగా టైర్ 2,టైర్ 3 నగరాల్లో ఇంకా తీవ్రమైన కృషి చేయాల్సి ఉంది. మహిళలు ఇప్పటికీ భార్య, తల్లి,సంరక్షకుని, సాంప్రదాయక పాత్రలతో ముడిపడి ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు.

చాలామంది ఇంకా వారిని వ్యాపారవేత్తలుగా చూడడం లేదు.గత కొన్నేళ్లుగా… ముఖ్యంగా మహమ్మారి సమయంలో, భారతదేశంలో ఇ-కామర్స్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. టైర్ 2,3 నగరాల్లోని చాలా మంది మహిళలు ఆన్‌లైన్‌లో క్రయవిక్రయా లు చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందారు. వారి వ్యాపార విజయానికి డిజిటల్ టెక్నాలజీ, ఇ-కామర్స్,డేటా తప్పనిసరి అయ్యాయి. విద్యావంతు లు, పట్టణ ప్రజలకు ఈ సాంకేతికతలను అందిపుచ్చుకోవడం,అవలంబించడం చాలా తేలిక. కానీ భారతదేశంలో చాలామంది ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం,క్రెడిట్,భాషా అవరోధాలకు సంబంధించిన అవగాహనతో పోరాడుతున్నారు.దీంతోపాటు సామాజిక లింగ అవరోధాలతో పోరాడాల్సిన అంతర్గత నగరాలు,గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా వ్యాపార యజమానులు ఎక్కువగా దెబ్బతిన్నారు. అందువల్ల, వ్యాపారం ,సాంకేతికత గురించి కేంద్రీకృత విద్య,శిక్షణ చాలా అవసరం. దీనిద్వారా మహిళలను శక్తివంతం చేయడం చాలా కీలకం.

మహిళా వ్యాపారవేత్తలు విజయవంతం కావడానికి సాంకేతికత ఎలా సహాయపడుతుం దో చెప్పే మూడు కారణాలను మాస్టర్‌కార్డ్ ఆవిష్కరించింది.

  1. వ్యాపారాలను మరింత సమర్ధంగా నిర్వహించడం: డిజిటల్ సాంకేతికతలను
    స్వీకరించడం ద్వారా అమ్మకాలు, ఆర్డర్‌లు,ఇన్వెంటరీని క్రమపద్ధతిలో నిర్వహించగలుగుతారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా సమర్థత పెరగడమే కాకుండా ఆర్థిక విషయాలపై స్పష్టమైన అవగాహన, ఆలోచన వస్తుంది. తద్వారా వ్యాపారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఉదాహరణకు: మాస్టర్‌కార్డ్‌,యూఎస్‌ఏఐడీ ద్వారా ప్రాజెక్ట్ కిరాణా వంటి కార్యక్రమాలు టెక్-అండ్-టచ్ శిక్షణా పద్దతిని ప్రభావితం చేస్తాయి,పీర్-లెర్నింగ్ గ్రూప్‌లతో కిరాణాలను ఎంగేజ్ చేయడం, వీడియో-ఆధారిత కంటెంట్‌ను అందించడం చేయవచ్చు. దీనిద్వారా మహిళల యాజమాన్యంలోని కిరాణా స్టోర్‌లు ఆదాయ
    మార్గాలు పెరుగుతాయి. వీటికితోడు వారికి వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వడం.డిజిటల్
    చెల్లింపులను ఎలా చేయాలో నేర్పిస్తే వాళ్లే తర్వాతి నుంచి అనుసరిస్తారు.
  2. క్రెడిట్ యాక్సెస్‌ను ప్రారంభించడం: మహిళల యాజమాన్యంలోని చాలా వ్యాపారాలు చిన్న -సంస్థలు. ఈ వ్యాపారాలు చిన్నవి కావడం, అవి వేరే వాళ్ల మార్గనిర్దేశకత్వంలో ఉండడం వల్ల వారి కార్యకలాపాల కోసం క్రెడిట్ లైన్లను ఏర్పాటు చేయడంలో ఇబ్బందిని కలిగి ఉన్నాయి. అటువంటి సంస్థలు తమ కార్యకలాపాలను డిజిటలైజ్ చేసినప్పుడు,రూపొందించబడిన డేటా రుణదాత లు వారి క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడంలో సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులను స్వీకరించడం వలన అధికారిక క్రెడిట్ లైన్లలోకి
    ప్రవేశించడానికి ఒకరికి అధికారం లభిస్తుంది. మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు వృద్ధి చెందడానికి,విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు: భారతదేశంలో హెచ్‌డిఎఫ్‌సి, మాస్టర్‌కార్డ్‌, యూఎసల్‌ఏఐడీ ,డీఎఫ్‌సీ ప్రారంభించిన 100 మిలియన్ల డాలర్ల క్రెడిట్ సదుపాయం చిన్న వ్యాపారాలకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను విస్తరిస్తుంది. ముఖ్యంగా మహమ్మారి ప్రభావాల నుండి వారి డిజిటలైజేషన్,రికవరీకి మద్దతుగా ఫైనాన్సింగ్ అవసరమయ్యే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  3. రీచ్,కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం: టెక్నాలజీ వ్యాపారాలు తమ
    పరిధిని విస్తరించుకోవడంలో సహాయం చేస్తుంది,కస్టమర్‌లకు వారు ఆశించిన
    అనుభవాన్ని అందించడానికి అనుమతిస్తుంది. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు మహిళా వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు రవాణా చేయడంలో సహాయపడతాయి. సోషల్ మీడియా అనేది వ్యాపారాలు తమ ఉత్పత్తుల గురించి విస్తృతమైన కస్టమర్ బేస్‌కు అవగాహన కల్పించడానికి మరొక శక్తివంతమైన సాధనం.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే, వ్యాపా రంలో ఉన్న మహిళలకు సరైన మద్దతు,నెట్‌వర్క్ ఉండాలి. అనేక సంస్థలు, అది పబ్లిక్, ప్రైవేట్ లేదా నాన్-గవర్నమెంట్ అయినా, మహిళలకు మద్దతు, సాధికార త కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగపడు తుంది. అయితే అంతటితో ఆగకుండా ఒకరినొకరు నేర్చుకోవడానికి,స్థిరంగా ఎదగడానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలు గల మహిళల నెట్‌వర్క్‌ల నుండి అతిపెద్ద బలం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు ఎన్ని ఉన్నా… వారిని సదా వెన్నుతట్టి ప్రోత్సహించే కుటుంబ సభ్యుల మద్దుతు కూడా చాలా అవసరం.

error: Content is protected !!