365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,7 ఫిబ్రవరి 2022 : మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగానే సైబర్ మోసాలు ,రాన్సమ్‌వేర్ దాడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ తరహా స్థితికి ప్రధానకారణం వినియోగదారులతో పాటుగా వ్యాపార సంస్థఽలకు తమ సమాచారం, నగదును సురక్షితంగా ఉంచాలనే అంశంపై అవగాహన లేకపోవడం. మరీముఖ్యంగా హ్యాకర్లు నగదు తస్కరించడానికి తమకు లభించే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అవగాహన విస్తరించడంతో పాటుగా ఈ సంవత్సర నేపథ్యమైన ‘టుగెదర్ ఫర్ ఏ బెటర్ ఇంటర్నెట్(మెరుగైన ఇంటర్నెట్ కోసం కలిసి కట్టుగా ఉండటం)’కు అనుగుణగా మాస్టర్ కార్డ్ కొన్ని అవసరమైన భద్రతా చిట్కాలను పంచుకుంది. వీటి ద్వారా ప్రతి ఒక్కరూ తమ డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా ,ఆందోళన లేని రీతిలో నిర్వహించగలమనే భరోసా పొందుతారు.సైబర్ నేరగాళ్లు అసంఖ్యాక మార్గాలలో వినియోగదారులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వినియోగదారులు ఖచ్చితంగా తమ ఖాతా సంబంధిత సమాచారాన్ని అనుమానాస్పద వెబ్ సైట్లను లేదా అనుమానాస్పద ఈ–మెయిల్ ఎటాచ్‌మెంట్లను తెరువడం ద్వారా అందించకూడదు. చెల్లింపుల తరువాత తామందుకున్న సందేశాల పట్ల చెల్లింపుదారులు ఖచ్చితంగా ఓ చూపు సారించాల్సి ఉంది,క్రమం తప్పకుండా తమ ఆర్ధిక స్టేట్‌మెంట్లను పరిశీలించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. తమ పేరు, పుట్టిన రోజులను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగించడాన్ని నిరోధించాల్సిందిగా మాస్టర్ కార్డ్ సలహా ఇస్తుంది. ఒకవేళ ఆ తరహా పాస్‌వర్డ్‌లు కలిగి ఉంటే వాటిని మారుస్తుండాలి.తద్వారా సైబర్‌దాడుల ముప్పు భయం నుంచి బయటపడవచ్చు. సైబర్ దాడుల ప్రమాదాలను తగ్గించుకోవడానికి వినియోగదారులు వై–ఫై నెట్‌వర్క్స్ లేదా పబ్లిక్ ఉపకరణాలను వాడుకోవడం నిరోధించాలి. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీల వేళ దానిని ఖచ్చితంగా అనుసరించాలి. అందరికీ సుపరిచితమైన లేదా ఆర్‌బీఐ ధృవీకృత చెల్లింపుల గేట్‌వేలు ద్వారా మాత్రమే తమ ఆన్‌లైన్ చెల్లింపుల లావాదేవీలను పూర్తి చేయాలి.
అంతేకాదు చెల్లింపుల కోసం క్యుఆర్ కోడ్స్ స్కానింగ్ చేసే సమయంలో వినియోగదారులకు ఆ అంశాల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటుగా లబ్దిదారుల విశ్వసనీయతను సైతం పరీక్షించాలి.అదనంగా, బ్యాంకు ఖాతాల భద్రత వినియోగదారులతో పాటుగా సంబంధిత బ్యాంకులకు కూడా బాధ్యత ఉంటుంది.అందువల్ల బ్యాంకులు, ఏదైనా మోసపూరిత చర్యలు జరుగుతున్నట్లుగా గుర్తించినట్లయితే ఖచ్చితంగా వాటిని వినియోగదారులకు తెలియజేయాలి. వినియోగదారులు ఖచ్చితంగా రెండంచెల ఈ–మెయిల్ అథెంటికేషన్‌ను ఆన్
చేసి మాత్రమే తమ ఖాతాలలోకి లాగిన్ కావడం ద్వారా అధిక చెల్లింపు మోసాలకు దారితీసేలా తమ ఖాతాలను మోసగాళ్ల బారిన పడకుండా రక్షించుకోగలరు. 2022లో సైబర్ పరంగా అత్యంత శక్తివంతమైన చెల్లింపుల నెట్‌వర్క్‌ను సృష్టించడానికి మాస్టర్ కార్డ్ కట్టుబడి ఉంది.
తద్వారా సరళమైన, సౌకర్యవంతమైన వినియోగదారుల అనుభవాలను పొందగలరు. పలు కార్యక్రమాలైనటువంటి కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్ సేవలు, 3డీఎస్ 2.0 డాటా రిచ్ ప్రోటోకాల్‌ను రూపొందించడం,చెల్లింపు సేవల్లో బయోమెట్రిక్‌లను చేర్చడం వంటి వాటి ద్వారా మోసగాళ్ల చర్యలను అధిగమించడంతో పాటుగా బ్యాంకులు, వినియోగదారులకు సైబర్ వాతావరణంలో రక్షణను మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.