365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జూన్ 19,2024: భారతదేశపు జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెనస్ కంపెనీ లిమిటెడ్ (టాటా ఏఐఏ) 2024 ఆర్థిక సంవత్సరానికి గాను తమ పార్టిసిపేటింగ్ (PAR) పాలసీదారులకు రూ. 1,465 కోట్ల బోనస్ ప్రకటించింది.
కంపెనీ ఇప్పటివరకు ప్రకటించిన బోనస్ పేఅవుట్‌లో ఇదే అత్యధికం. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రూ. 1,183 కోట్లతో పోలిస్తే 24 శాతం అధికం.
పెట్టుబడుల నిర్వహణలో టాటా ఏఐఏకి గల సామర్థ్యాలు, పటిష్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు మొదలైన అంశాలు పార్టిసిపేటింగ్ పాలసీదార్లకు నిలకడగా అత్యధిక బోనస్‌లను ప్రకటించేందుకు తోడ్పడుతున్నాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో టాటా ఏఐఏ పరిశ్రమలోనే అత్యుత్తమమైన పర్సిస్టెన్సీ పనితీరు (ప్రీమియం ఆధారంగా) సాధించింది. 13వ నెల (89.40%), 25 వ నెల (80.70%), 37వ నెల (75.00%) మరియు 49వ నెల (73.10%)కు సంబంధించి 4 కోహొర్ట్‌లలో నంబర్ 1 ర్యాంకు దక్కించుకుంది.
ఏటా తమ జీవిత బీమా పాలసీని పునరుద్ధరించుకునే పాలసీదారుల శాతాన్ని పర్సిస్టెన్సీ నిష్పత్తి సూచిస్తుంది. బ్రాండ్ పట్ల వారికి గల నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది.
“మా పార్టిసిపేషన్ పాలసీలపై బోనస్‌ల చెల్లింపులకు సంబంధించి మరో ఏడాది కూడా అత్యుత్తమ పనితీరు కనపర్చడంపై ఎంతగానో సంతోషంగా ఉన్నాం. మాపై నమ్మకం ఉంచే మా పాలసీదార్లకు ప్రయోజనాలను అందించడంలో మాకు గల నిబద్ధతకు ఈ రికార్డు స్థాయి బోనస్ నిదర్శనంగా నిలవగలదు.
మా వినియోగదారులు నిశ్చింతగా జీవనం సాగించేలా, ప్రియమైన వారి పట్ల తమకు గల ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వారికి అత్యధిక రాబడులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం” అని టాటా ఏఐఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.
టాటా ఏఐఏ వినియోగదార్లకు జీవిత బీమా కవరేజీ, రాబడి, అలాగే బోనస్‌ల రూపంలో ప్రయోజనాలను కూడా అందించే పాలసీలను అందిస్తోంది. మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో ఉండే రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఈ సొల్యూషన్స్ ద్వారా తమ పెట్టుబడులను వృద్ధి చేసుకోవచ్చు.
టాటా ఏఐఏ స్మార్ట్ వేల్యూ ఇన్‌కం ప్లాన్ అటువంటి పాలసీనే. ఇది లైఫ్ కవర్‌తో పాటు పాలసీని కొనుగోలు చేసిన తేదీ నుంచి అత్యంత తక్కువగా వారం రోజుల నుంచే నగదు బోనస్‌ను అందుకునే ఆప్షన్‌ను అందిస్తుంది. అంతేగాకుండా పాలసీదార్లు సబ్ వాలెట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
తమకు లభించిన నగదు బోనస్‌ను ఇందులో ఉంచుకుని, దానిపై వడ్డీని కూడా పొందవచ్చు. 100 ఏళ్ల వయస్సు వరకు రాబడి అందుకునే ఆప్షన్ ఈ పాలసీలో ఉంది.
తమ వినియోగదార్లకు నిరంతంగా ప్రయోజనాలు చేకూర్చాలనే దీర్ఘకాలిక దృష్టికోణంతో కంపెనీ పటిష్టమైన రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. 3 ఏళ్ల వ్యవధిలోనే నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) పరిమాణం రెట్టింపై రూ. 1 లక్ష కోట్లకు చేరేందుకు ఇది తోడ్పడింది.
టాటా ఏఐఏ రేటెడ్ ఏయూఎంలో 91 శాతానికి 2024 మార్చి 31 నాటికి అయిదేళ్ల ప్రాతిపదికన మార్నింగ్‌స్టార్ రేటింగ్స్* నుంచి 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్స్ ఉండటమనేది పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నాణ్యతను సూచిస్తుంది.
Also read : Tata AIA announces its highest ever bonus payout of INR 1,465 crores
ఇది కూడా చదవండి :మోసపూరిత వాట్సాప్ గ్రూప్‌లు, స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెచ్చరిక
Also read : HDFC Securities Caution customers against Fraudulent WhatsApp Groups and Impersonation Scams
ఇది కూడా చదవండి :కారు దొంగతనం తర్వాత బీమా క్లెయిమ్ ఎలా పొందాలో తెలుసా..
Also read : PhonePe Payment Gateway Launches Referral Program..
ఇది కూడా చదవండి :కూరగాయల ధరలు : సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం..