365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 10,2023: చార్ ధామ్ యాత్ర చేసే వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు, ప్రయాణ సమయంలో ఏర్పడే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మూడంచెల ఆరోగ్య మౌలిక వసతుల నిర్మాణం జరుగుతోంది.
దీనికి తోడు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాలకు అత్యవసర సమయంలో ఔషధాలు సరఫరా చేసేందుకు డ్రోన్ లను కూడా ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాలన్నీ గఢ్వాల్ హిమాలయాల్లో 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి.
అలాంటి ప్రాంతాల్లో ఏవైనా అత్యవసర వైద్య అవసరాలు ఏర్పడితే భక్తులకు డ్రోన్ ల ద్వారా ఔషధాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
అలాగే ఎయిమ్స్ హృషీకేశ్, డూన్ వైద్య కళాశాల, శ్రీనగర్: వైద్య కళాశాలల సహకారంతో ఒక రిఫరల్ మద్దతు వ్యవస్థ (బ్యాక్ ఎండ్ సిస్టమ్) ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
చార్ హైవేపై ఎమర్జెన్సీ రవాణాకు కీలకమైన ప్రాణ రక్షణ వ్యవస్థలతో కూడిన అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణ సమయంలో యాత్రికులకు ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) వైద్య విద్యార్ధులను నియోగిస్తారు.
ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల గురించి ఒక పోర్టల్, ఒక వెబ్ సైట్ నిరంతరం సమాచారం అందిస్తాయి. భక్తులు ప్రయాణించే మార్గంలో స్థానిక ఆరోగ్య వసతులు, కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు, ఫ్రీ ట్రావెల్ స్క్రీనింగ్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ . నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి.