Mega Brother Nagababu unveils autism toll free number poster Mega Brother Nagababu unveils autism toll free number poster

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 6,2021హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా సలహాలు, గైడెన్స్ అందించడం కోసం 9100181181 helpline పోస్టర్ను ప్రముఖ నిర్మాత- మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఆవిష్కరించారు. ఈ హెల్ప్లైన్ ద్వారా ఆటిజం బాధిత కుటుంబాలు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారి ఎదుగుదలలో వచ్చే మార్పులు, లోపాలు వాటి పరిష్కార మార్గానికి సంబంధించి ఉచితంగా సలహాలు, గైడెన్స్ పొందవచ్చని పినాకిల్ బ్లూమ్స్ సంస్థ వెల్లడించింది.

Mega Brother Nagababu unveils autism toll free number poster
Mega Brother Nagababu unveils autism toll free number poster

ఆటిజంతో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఉండదని, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటారని, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరని, వెలుగుని, శబ్దాన్ని కూడా భరించలేరని తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నారని, వారి కోసం helpline ఏర్పాటు చేశామని తెలిపింది. ఆటిజంతో పుట్టిన పిల్లలు శాపగ్రస్తులు కారనీ, థెరపీల ద్వారా వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా చేయవచ్చన్న పినాకిల్ బ్లూమ్స్ ప్రయత్నాలు విజయవంతం కావాలని నాగబాబు ఆకాంక్షించారు.