365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 2, 2025 : మెగా కుటుంబంలో నూతన కాంతులు నింపుతూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి తమ ముద్దుల కుమారుడికి అద్భుతమైన పేరును ప్రకటించారు.

సాక్షాత్తూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో, బలం, శక్తి ఉట్టిపడేలా ఆ చిన్నారికి ‘వాయువ్ తేజ్ కొణిదెల’ (Vaayuv Tej Konidela) అని నామకరణం చేశారు.

ఈ విషయాన్ని మెగా జంట తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేయగా, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వాయువు (Vaayuv) అంటే వాయు దేవుడిని సూచించే పేరు. వాయు పుత్రుడైన ఆంజనేయ స్వామి పేరు స్ఫూర్తితోనే ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు బలం, సాహసం, శక్తిని సూచిస్తుంది.

‘శక్తి, బలం నిండిన పేరు!’ అంటూ ఈ జంట ఆనందాన్ని వ్యక్తం చేయగా, మెగా ఫ్యాన్స్ ఈ గుడ్ న్యూస్ ను దసరా ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.