365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 20,2023: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో పాప జన్మించినట్లు ప్రకటించింది.

ప్రకటన ఇలా ఉంది.. “ఉపాసన కామినేని కొణిదెల,రామ్ చరణ్ కొణిదెలకు 2023 జూన్ 20న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఆడపిల్ల పుట్టింది. పాప, తల్లి ఇద్దరూ బాగానే ఉన్నారు.”

మెగా స్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న ఉపాసనా ను పరామర్శించారు. మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా కుటుంబంలోనే కాకుండా, మెగా ఫాన్స్ లో సైతం పండగ వాతావరణం కనిపించింది.

https://www.youtube.com/watch?v=a_BUQHa8X0Y

సోమవారం ఉపాసన,రామ్ చరణ్ హైదరాబాద్ ఆసుపత్రిలోకి వెళుతున్న వీడియో బయటకు లీకైంది. ఈ వీడియోలో ఉపాసన అత్తగారు కొణిదెల సురేఖ, భర్త రాంచరణ్ తోపాటు ఆమెతల్లి శోభన కామినేని ఉన్నారు. రామ్ చరణ్-ఉపాసన 2012 లో వివాహం చేసుకున్నారు. గత డిసెంబర్‌లో గర్భవతి అయినట్లు ప్రకటించారు.

https://www.youtube.com/watch?v=a_BUQHa8X0Y

SS రాజమౌళిఅందించిన బ్లాక్ బస్టర్ సినిమా “RRR” ఇద్దరు స్టార్లలో ఒకరిగా రామ్ చరణ్ వృత్తిపరంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందాడు. RRR నాటు నాటు పాట కోసం ఆస్కార్ ,గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకుంది. ఈ సమయంలో ఉపాసన తన భర్తతో కలిసి రెండు అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు.