365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 26,2024: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. ఈ సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు.

గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ఇలా ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన ధీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యారు.

ఇలాంటి పరిస్థితులో సాయి దుర్గ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు.

అన్ని విధాల అండగా ఉంటామని సాయి దుర్గ తేజ్ భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించానంటూ నటి పావల శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.

ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావల శ్యామల గుర్తు చేసుకున్నారు.

Also read: Want To Quit Smoking? WHO Issues Effective Treatment Guidelines To Reduce Tobacco Consumption