365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 21,2022: మెగాస్టార్ చిరంజీవి తెలుగు వెండి తెరపై సంచలన విజయాలు సాధిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని,‘ బిగ్గర్ దెన్ బచ్చన్’గా సైతం కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి గారికి ‘భారతరత్న ’ పురస్కారానికి కావాల్సిన అర్హతలన్నీ పుష్కలంగా వున్నాయని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు తెలిపారు.
అందుకు ఆయన సాధించిన.. సాధిస్తున్న పురస్కారాలే సాక్ష్యమని వెల్లడించారు. త్వరలోనే ఆయన ‘ భారతరత్న ’ పురస్కారాన్ని సైతం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు రవణం స్వామి నాయుడు. ఇండియన్ ఫిల్మ్ పర్మనాలిటీ ఆఫ్ ది ఇయర్ ` 2022’’ అవార్డుకు ఎంపికైన శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కెరీర్ ఆరంభంలోనే దక్షిణాదిలో అగ్ర హీరోలు, దర్శకులతో కలిసి పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని స్వామినాయుడు అన్నారు.
నంది అవార్డులు, ఫిలింపేర్ అవార్డులు, డాక్టరేట్, పద్మవిభూషణ్ వంటి అత్యుత్తమ పురస్కారాలు అందుకుని, తిరుగులేని మేటి నటుడిగా గుర్తింపు పొందారని, 53వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవాల్లో భాగంగా ‘‘ఇండియన్ ఫిల్మ్ పర్మనాలిటీ ఆఫ్ ది ఇయర్ ` 2022’’ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారిని వరించడంపట్ల స్వామినాయుడు సంతోషం వ్యక్తం చేశారు.