365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 3,2025: ఇటీవ‌ల, మన తెలుగు రాష్ట్రాల నుండి పారా అథ్లెట్‌గా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి దేశం లో పేరు తెచ్చిన వారు దీప్తి జీవాంజి. వ‌రంగ‌ల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె, తన ప్రదర్శనతో దేశాన్నే గర్వపడేలా చేసింది.

ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తర్వాత, నేను దీప్తిని అడిగాను “మీకు ఏమి కావాలనుకుంటున్నారు?” అప్పుడు ఆమె చెప్పింది చిరంజీవిని కలవాలని. అప్పుడు ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పగానే, ఆయన వెంటనే స్పందించారు. “ఆమె ఒక గొప్ప అచీవ్‌మెంట్ సాధించింది, ఆమె నన్ను కలవడం కాదు, నేను అకాడమీకి వెళ్లి ఆమెను కలుస్తాను” అని చెప్పారు.

అవసరమైనట్లుగా, చిరంజీవి మా అకాడమీకి వచ్చి అక్కడున్న పిల్లలతో సుమారు రెండు గంటలు గడిపారు. ఆయన తన మాటలతో ప్రతి ఒక్క ప్లేయర్‌ని ప్రేరేపించారు.

ఈ సందర్భంలో, చిరంజీవిగారు మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తి జీవాంజికి అందించడం మాకు ఎంతో గర్వకరమైన క్షణం. ఇది మా స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి చిరంజీవి నుంచి వచ్చిన గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ ఇన్‌స్పిరేష‌న్‌తో మరెన్నో యువతులు మరింత ఉన్నత శిఖ‌రాలు చేరుకుంటాయనే నమ్మకం కలిగింది.