Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 22,2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్, మెగాస్టార్ చిరంజీవికి సంబంధిత సర్టిఫికెట్‌ను అందించారు.

డాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేయడం ద్వారా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 156 చిత్రాలలో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్‌లో నమోదుకావడంతో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

error: Content is protected !!