Megastar-Chiru365telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 29,2023: ఆదివారం అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిపారు.

చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, నాగబాబు, సోదరిమణులు తల్లి అశీస్సులు తీసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అంజనాదేవికి బర్త్ డే విషెస్ చెబుతూ కుటుంబ సభ్యులు సందడి చేశారు. “మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. 💐💐 జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ… 🙏Happy Birthday అమ్మ !!.. అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో తన తల్లి అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేశారు.

Source From Twitter

Megastar-Chiru365telugu
Megastar

Source From Twitter

ఏ పనిలో ఉన్నా తల్లి పుట్టినరోజునాడు అందరూ కలుసుకుంటూ ఉంటారు. ఇది ప్రతిఏటా మెగా కుటుంబం ఒకచోట చేరుతుంది.

రామ్ చరణ్, ఉపాసన ఇతర సభ్యులంతా తమ తమ పనులు పక్కనపెట్టి అంజనాదేవితో ఆదివారం సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తన తల్లితో దిగిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులతో పంచుకున్నారు.