Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 4 ,2022: అద్భుతమైన క్రీడ క్రికెట్ ప్రారంభమైన వేళ పరిపూర్ణ ప్రతిభ, శ్రేష్టమైన ఆటతీరు మాత్రమే కాదు అనేక ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయి. ధైర్యం, పట్టుదల, స్వీయ-నమ్మకం, పోరాట పటిమ వంటి అసాధారణమైన విలువలతో పాటు అచ్చమైన క్రీడాస్ఫూర్తిని ఆటగాళ్లు చాటతారు. వారి విలువలు మైదానం లోపల, వెలుపల కూడా పరీక్షకు గురై క్రికెట్‌ లెజెండ్‌ అంటే ఏంటో చూపుతాయి. ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ మెన్ ఆఫ్ ప్లాటినం ఈ అరుదైన లక్షణాలు కలిగిన వ్యక్తులను అభినందిస్తుంది. ఈ క్రికెటింగ్‌ సీజన్‌లో తన తాజా ప్రచారంలో భాగంగా అద్భుతమైన క్రికెట్‌ ప్లేయర్‌ KL రాహుల్‌తో బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నందుకు బ్రాండ్‌ గర్విస్తోంది.

ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు బ్రాండ్ తన #MomentOfTruth ప్రచారంలో భాగంగా KL రాహుల్‌తో ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నిజమైన క్రీడాకారుడి ఆట ఆడటం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలియజెప్పడంతో పాటు ఈ మెటల్‌కు, భారత్‌ మెచ్చే ఈ క్రికెట్‌ ఆటగాడి మధ్యన ఉన్న లోతైన అనుబంధాన్ని చూపుతుంది. శత్రు సమూహాలు, తీవ్రమైన ఒత్తిడి, గాయాలు వంటివి ప్రతి క్రీడాకారు డు ఎదుర్కొనే సవాళ్లు. ఇవి అనివార్యమైనప్పటికీ ఆ ఎంపికలు అబ్బాయిల నుంచి పురుషులను వేరు చేస్తాయి.

KL రాహుల్ సూక్ష్మమైన, విభిన్నమైన శైలి ప్లాటినమ్‌కు చక్కగా ఇమిడిపోతుంది. నక్షత్రాల నుంచి పుట్టిన ప్లాటినం ఖగోళ మూలాలున్నలోహం. బిలియన్ల సంవత్సరా ల క్రితం ఒక ఉల్క విరిగిపడి ఈ అద్భుతమైన తెల్లని లోహం అవశేషాలను మిగిల్చింది. నేటికీ ప్లాటినం నిల్వలు పరిమితం ఉండటం వలన ఇది నిజంగా అరుదైన, విలువైన లోహంగా నిలుస్తోంది. బంగారం కంటే 30 రెట్లు అరుదైన ప్లాటినం. దానిని ధరించే ప్లాటినం పురుషుల చెదరని స్ఫూర్తి వలే అది తన సహజమైన తెల్లటి కాంతిని ఎన్నటికీ కోల్పోదు. 95% కంటే అధిక స్వచ్ఛత హామీతో
అత్యున్నత నాణ్యతను కలిగి ఉంటుంది ప్లాటినం.

ఏప్రిల్ 1 నుంచి టీవీలో ఈ ప్రచారం ప్రారంభమవుతుంది. అలాగే అధిక రీచ్‌, ఫ్రీక్వెన్సీ కోసం ప్రింట్, డిజిటల్, PR ద్వారా మార్కెట్‌లో అనుబంధ ప్రచారం సాగుతోంది. ఈ మాధ్యమాల ద్వారా అందించే దీనిపై ఆదరణ పెంచేలా
నిలుస్తుంది.బ్రాండుకు ప్రధాన ఆదరణగా నిలుస్తున్న పురుష ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఏప్రిల్ 3 నుంచి మే 2 వరకు క్విజ్‌ పోటీల రూపంలో రెండు కార్యక్రమాలను బ్రాండ్‌ చేపడుకతోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే వారికి మ్యాన్‌ ఆఫ్‌ ది ప్లాటినం KL రాహుల్‌ను వర్చువల్‌గా కలిసి అభినందించే అవకాశం లభిస్తుంది. @menofplatinum ద్వారా Instagram/Facebook హ్యాండిల్స్‌లో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. క్విజ్ మొదటి దశ డిస్నీ హాట్‌స్టార్‌లో KL రాహుల్‌తో “లీగ్ ఆఫ్ ప్లాటినం మెన్” అనే 6-భాగాల మిని సిరీస్ ఆధారంగా రూపొందించబడింది.

తదుపరి దశ ఐపీఎల్‌కు సంబంధించిన ప్రశ్నలతో పాటు వారి క్రికెట్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటుంది.మెన్‌ ఆఫ్‌ ప్లాటినంతో అనుబంధంపై KL రాహుల్ మాట్లాడు తూ, “విజయం మాత్రమే నాయకుడిని నిర్వచించదు.ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు వదలకుండా జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తేనే మైదానంలో విజయం. కొత్త క్రికెట్ సీజన్‌ప్రారంభిస్తున్న వేళ మెన్ ఆఫ్ ప్లాటినం, మెటల్‌తో నా అనుబంధాన్ని కొనసాగించడానికి నేను సంతోషిస్తున్నాను, ఇది నా శైలికి సరిగ్గా సరిపోతుంది” అన్నారు. ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ – ఇండియా డైరెక్టర్ – కన్స్యూమర్ మార్కెటింగ్ సుజలా మార్టిస్ ఇలా అన్నారు,
“మెన్ ఆఫ్ ప్లాటినం అనేది ఈ రోజు పురుషులు చూస్తున్న ఆదర్శప్రాయమైన విలువల స్వరూపం, దాన్ని వారు విజయంగా భావిస్తారు.

ఈ విలువలు క్రికెట్‌కు కూడా సరిపోతాయి. నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ధైర్యం, పట్టుదల,అందరినీ కలుపుకొని పోయే గుణం వంటివి మచ్చుకు కొన్ని. మాకు క్రికెట్ అంటే నిరంతరాయమైన అనుబంధం.పురుష TGతో క్రికెట్‌లో అత్యంత జనాదరణ పొందిన ఈ ఈవెంట్ కంటే మెరుగైనది మరొకటి ఉండదు, భారతదేశ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన KL రాహుల్‌తో మా అనుబంధాన్ని కొనసాగించడానికి మేము సంతోషిస్తున్నాము.ఈ ఐపిఎల్ సీజన్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచడానికి మేము ఎంగేజ్‌మెంట్ లెగ్‌ కూడా నడుపుతున్నాము, ప్రేక్షకులకు వారి ఐకాన్ కెఎల్ రాహుల్‌ను వర్చువల్‌గా కలిసే అవకాశం కల్పిస్తాం” అన్నారు.

error: Content is protected !!