365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 9,2023:జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం G-క్లాస్ – G 400d అడ్వెంచర్ ఎడిషన్, G 400d AMG లైన్ రెండు వేరియంట్‌లను గురువారం విడుదల చేసింది.

వాటి ధర 2 పాయింట్ 55 కోట్ల నుంచి మొదలవుతుంది.

రెండు వేరియంట్‌ల సరఫరాలు ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి ప్రారంభమవు తాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లకు కొత్త ‘జి 400’ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కంపెనీ తెలిపింది.

మెర్సిడెస్-బెంజ్ కార్లు అధిక డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని భారత మార్కెట్‌కు కేటాయింపుల ఆధారంగా ఈ వేరియంట్‌ల సరఫరా ఉంటుందని కంపెనీ తెలిపింది. Mercedes-Benz ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ, “కస్టమర్ల దృష్టి SUV సెగ్మెంట్‌పైనే ఉంది. G-క్లాస్ భారతీయ కస్టమర్‌లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహనం.