365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, మే 10, 2025: జేఎస్‌డ‌బ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా సంస్థ హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్ షోరూమ్‌లో నూతన MG Windsor PRO మోడల్‌ను ఘనంగా ఆవిష్కరించింది. తాజా 52.9 kWh బ్యాటరీ ప్యాక్, అత్యాధునిక సురక్షిత మరియు సాంకేతిక ఫీచర్లతో ఈ వాహనం బిజినెస్ క్లాస్ ప్రయాణానికి కొత్త ప్రమాణాలను ఏర్పరచనుంది.

ప్రముఖ BaaS (Battery-as-a-Service) స్కీమ్ ఆధారంగా ఈ వాహనం ధర రూ.12.49 లక్షలుగా నిర్ణయించబడింది, కిలోమీటరుకు రూ.4.5 చార్జ్ అమలులో ఉంటుంది. తొలి 8,000 బుకింగ్‌లకు పరిమితమైన ఆఫర్ క్రింద ఎక్స్‌షోరూం ధర రూ.17,49,800గా ఉంది.

PRO మోడల్‌లో ముఖ్యమైన హైలైట్స్..

PRO Battery: 52.9 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్, 449 కిమీ (MIDC P1+P2) ధృవీకృత రేంజ్.

PRO Safety: 12 మెజర్ ADAS లెవెల్ 2 ఫీచర్లు – అద్భుతమైన డ్రైవింగ్ సేఫ్టీకి హామీ.

PRO Tech: Vehicle2Load (V2L), Vehicle2Vehicle (V2V) టెక్నాలజీలు – ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ పంపిణీ సామర్థ్యం.

PRO Convenience: Powered Tailgate వంటి ఆధునిక ఫీచర్లు – మరింత సౌలభ్యం.

PRO Interiors: డ్యూయల్-టోన్ ఐవరీ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ – ప్రీమియమ్ ఫీల్.

PRO Style: 3 కొత్త కలర్ షేడ్స్ – సెలడాన్ బ్లూ, ఆరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్. కొత్త 18’’ డ్యూయల్ టోన్ మిషన్ అలాయ్ వీల్స్.

అదనపు ప్రయోజనాలు..

JSW MG మోటార్ ఇండియా, కొత్తగా IDFC ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ వంటి ఆర్థిక సంస్థలను భాగస్వాములుగా తీసుకుంది. ఇప్పటికే ఉన్న బజాజ్ ఫిన్‌సర్వ్, హెరో ఫిన్‌కార్ప్, ఎకోఫై, విద్యుత్‌టెక్ వంటి సంస్థలతో కలిపి మొత్తం 6 సంస్థలు ఈ BaaS స్కీమ్‌ను మద్దతు ఇస్తున్నాయి.

ఇది కూడా చదవండి…పలు రైళ్లు రద్దు.. ప్రయాణికులకు అసౌకర్యం..

This is also read..Essential Precautions to Take Before Laser Hair Removal

మొదటి యజమానికి లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ కూడా ఇవ్వనున్నారు. అదనంగా, 3 సంవత్సరాల తర్వాత వాహనం విలువలో 60% రీఫండ్ పొందే 3-60 బైబ్యాక్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

JSW MG మోటార్ ఇండియా MD అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ – “MG Windsor భారత 4 వీల్ EV విభాగాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు PRO మోడల్‌తో మరింత వినూత్నత, విశ్వసనీయతను వినియోగదారులకు అందించగలుగుతున్నాం” అని తెలిపారు.

PPS మోటార్స్ MD రాజీవ్ సంగ్వి మాట్లాడుతూ – “తెలంగాణలో ఇప్పటికే 225 బుకింగ్‌లు వచ్చాయి. వినియోగదారుల నుండి లభిస్తున్న స్పందన చూసి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం” అన్నారు.

PRO లో అధునాతన టెక్నాలజీ..

MG Windsor PROలో Vehicle2Load, Vehicle2Vehicle టెక్నాలజీతో పాటు, పవర్డ్ టెయిల్గేట్, ఆడాప్టివ్ క్రూస్ కంట్రోల్, లేన్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

135 డిగ్రీల వరకు recline అయ్యే ఏరో లౌంజ్ సీట్స్, గ్రాండ్‌వ్యూవ్ 15.6’’ టచ్ డిస్‌ప్లే, 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు, 100+ ఎయిఐ వాయిస్ కమెండ్‌లతో స్మార్ట్ ఎలక్ట్రిక్ అనుభూతి అందించనుంది.