365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 19,2024: 100 ఏళ్ళకు పైగా వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి (మోరిస్ గ్యారేజెస్) భారతదేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన మొట్టమొదటి (లెవల్ 1) ప్రీమియం ఎస్‌యువి అయిన ఎంజి గ్లోస్టర్ కోసం ప్రత్యేకమైన యాజమాన్య అనుభవ కార్యక్రమాన్ని ప్రకటించింది.
కారు నిర్వహణపై సున్నా వ్యయంతో పూర్తి మనశ్శాంతికి హామీ ఇవ్వడం ద్వారా అనుభవాన్ని మరింత పెంచడం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ యాజమాన్య అనుభవం ద్వారా, గ్లోస్టర్ తాలూకు అనేక అద్భుతమైన ఫీచర్లను అవరోధాలు లేకుండా అందుకోవడానికి అనుగుణంగా విక్రయానంతర సేవల ఆఫర్లనుఎంజి మోటార్స్ ఇండియా ప్రవేశపెట్టింది.
ఎంజిగ్లోస్టర్, ఆఫ్-రోడర్ ఎస్‌యువి, ప్రీమియం వాహన విభాగంలో తనదైన ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది.
ఆకర్షణీయమైన తన డిజైన్‌తో కస్టమర్‌లను గెలుచుకుంది, దృఢమైన నిర్మాణ నాణ్యత, విలాసవంతమైన ఫీచర్లకు ఇది పేరుపొందింది.
ఇప్పుడు యాజమాన్య అనుభవాన్ని మరొక అడుగు ముందుకు తీసుకువెళ్ళింది. ఎంజిగ్లోస్టర్ యజమానులు ఇప్పుడు అరుగుదలకు,తరుగుదలకు గురైన భాగాల ఖఱ్చులతో సహా జీరో సర్వీస్, రిపేర్ ఖర్చులను ఆస్వాదించవచ్చు.
యాజమాన్యంలోని మొదటి మూడు సంవత్సరాల పాటు 45,000 కి.మీ కారు ప్రయాణ పరిమితి వరకు వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త ప్రమాణాన్ని ఇది నెలకొల్పుతోంది.
ఈ కార్యక్రమం కింద, వైపర్ బ్లేడ్లు, ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, గొట్టాలు, మోటార్లు, బ్రేక్ ప్యాడ్లతో సహా విస్తృతమైన శ్రేణిలో అంశాలకు ఎంజి మోటార్ ఇండియా వర్తింపజేస్తోంది.
*దీనితోపాటు, మూడేళ్ళ వాహన యాజమాన్యం తరువాత గ్లోస్టర్ వినియోగదారులకు హామీ కలిగిన తిరిగి కొనుగోలు ఎంపికను ఎంజి మోటార్స్ అందిస్తోంది.
ఈ 3 సంవత్సరాల కవరేజినిన 5 సంవత్సరాలు/ 75000 కిలోమీటర్లకు విస్తరించుకోవడానికి ప్లాన్ల కొనుగోలును కూడా వినియోగదారులు ఎంచుకోవచ్చు. సర్వీస్ ఖర్చు లేనందున అందరూ ఇష్టపడే ఎస్‌యువిల్లో ఎంజి గ్లోస్టర్ ఒకటి.
గ్లోస్టర్ 30కి పైగా భద్రతా ఫీచర్ల లగ్జరీని అందిస్తోంది, ఇందులో ప్రత్యేకమైన డ్రైవర్ ఫెటీగ్ రిమైండర్ సిస్టమ్, విభిన్న రహదారి పరిస్థితులలో ప్రయాణికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
దీని డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ఎడిఎఎస్) డోర్ ఓపెన్ వార్నింగ్ (డిఓడబ్ల్యూ), రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ (ఆర్‌సిటిఎ),లేన్ ఛేంజ్ అసిస్ట్ (ఎల్‌సిఎ)లాంటి మార్గదర్శకమైన ఫీచర్లను పరిచయం చేసింది.
అవి ఈ ప్రీమియం ఎస్‌యువిలో అత్యుత్తమ భద్రతను అందిస్తాయి.ఇది 2డబ్ల్యూడి,4డబ్ల్యూడివేరియంట్లలో అందుబాటులో ఉంది, ఆరు లేదా ఏడుగురు ప్రయాణికులు దీనిలో ప్రయాణించవచ్చు.
ఈ విభాగంలోనే మొదటిదైన 158.5కెడబ్ల్యూ పవర్ కలిగిన ట్విన్-టర్బో వేరియంట్‌తో సహా శక్తివంతమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ దీని విశేషమైన పనితీరును నిర్ధారిస్తుంది.
ప్రీమియం ఫీచర్‌లతో పాటు, ఎంజిగ్లోస్టర్‌లో ఏడు మోడ్‌లతో కూడిన ఆల్-టెర్రైన్ సిస్టమ్, డ్యూయల్ పనోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, మసాజ్,వెంటిలేషన్‌తో కూడిన 12-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి.
డిఓడబ్ల్యూ, ఆర్‌సిటిఎ, ఎల్‌సిఎ లాంటి వినూత్న ఫీచర్లతో కూడిన గ్లోస్టర్‌లోని ఎడిఎఎస్భద్రతను మరింత మెరుగుపరుస్తోంది,ప్రయాణికులు,రహదారి భద్రత పట్ల దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది.
కారును సొంతం చేసుకోవాలనుకొనే ఔత్సాహికులకు ఎంజిగ్లోస్టర్ ఇష్టపడే ఎంపిక, ప్రీమియం ఎస్‌యువి సెగ్మెంట్‌లో ఎంజి గ్లోస్టర్ తాలూకు అగ్రస్థానాన్ని పటిష్టం చేసే పూర్తి యాజమాన్య ప్యాకేజీని ఇది అందిస్తోంది.
అసాధారణమైన డ్రైవింగ్ ప్రయాణంతో పాటు అవాంతరాలు లేని యాజమాన్య అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే వివేకవంతులైన వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
Also read : MGMotor India announces ownership experience program for Gloster
Also read : NSE to launch derivatives on Nifty Next 50 Index (NIFTYNXT50) from April 24, 2024