Mind Wars expands to regional Indian language - Tamil, Telugu, Malayalam, Marathi, Bangla, and KannadaMind Wars expands to regional Indian language - Tamil, Telugu, Malayalam, Marathi, Bangla, and Kannada

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, 27, ఆగస్టు 2020: స్కూలుకు వెళ్లే  వయస్సు గ్రూపులో ఉన్న పిల్లల కోసం భారతదేశంలో అతి పెద్ద నాలెడ్జ్ డేటాబేస్‌ని సృష్టించేందుకు ఏప్రిల్ 2019లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ద్వారా జీ5 ఫ్లాట్‌ఫారంపై మైండ్‌వార్స్ అనే ఇంటిగ్రేటెడ్ యాప్‌ లాంఛ్ చేయబడింది  ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన, పంచుకునేలా,గేమిఫైబుల్‌ అనుభూతి ద్వారా నాలెడ్జ్ పొందడం మందకొడిగా, విసుగుగా ఉంటుందనే భావనకు చెల్లుచీటి చెప్పాలనే లక్ష్యాన్ని మైండ్ వార్స్ కలిగి ఉంది.
ఇండియాని స్మార్టర్‌గా మార్చేందుకు అవసరమయ్యే నాలెడ్జ్‌ని మెరుగుపరిచే మార్గాలను పున: నిర్మించడాన్ని బలోపేతం చేయడానికి మైండ్ వార్స్ తన భాషా పోర్టుఫోలియోని హిందీ,ఇంగ్లిష్‌తోపాటుగా 6 ప్రాంతీయ భాషలు: తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, బంగ్లా ,కన్నడంకి విస్తరించబడింది.మైండ్ వార్స్ యాప్‌పై మాతృభాషలో లభించే కంటెంట్ అనేక అంవాల్లో విద్యార్ధుల నాలెడ్జ్‌ని బలోపేతం చేస్తుంది. దీని ఫలితంగా, ఇది వారి స్కూలు/భాషతో సంబంధం లేకుండా జాతీయ ఫ్లాట్‌ఫారంపై తన తోటివారితో పోటీపడేందుకు,చిట్టచివరికి టివి క్విజ్ షోలో భాగం అయ్యే అవకాశాన్ని ప్రతి విద్యార్ధి దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.మైండ్ వార్ విజయం సాధించడంపై  ఉమేష్ కుమార్ బన్సాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ మాట్లాడుతూ, “మైండ్ వార్ ఫ్లాట్‌ఫారంపై విద్యార్ధుల కొరకు కొత్త సవాళ్లు, డెవలప్‌మెంట్‌లు,ప్రోత్సాహాలతో 2020 అద్భుతమైన సంవత్సరంగా నిలుస్తుంది. ఇంగ్లిష్ ,హిందీకి అదనంగా మరో 6 భాషల్లో కంటెంట్ అనువదించడంతో, మన దేశవ్యాప్తంగా ఉండే విద్యార్ధులతో గరిష్టంగా అనుసంధానం కావడానికి , బాష అంతరాలు లేకుండా అనుసంధానం అయ్యేలా చేయడానికి దోహదపడుతుంది.