Minister Errabelli and TRS state leader Vaddiraju Ravichandra visited the Yadadri TempleMinister Errabelli and TRS state leader Vaddiraju Ravichandra visited the Yadadri Temple
Minister Errabelli and TRS state leader Vaddiraju Ravichandra visited the Yadadri Temple

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, యాదాద్రి ,జూన్ 15,2021: సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర . అనంతరం యాదాద్రి పునఃర్నిర్మాణ కట్టడాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు.