365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి19,2022: రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శ్రీయాద‌గిరి ల‌క్ష్మీనర్సింహ‌స్వామి వారిని మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగ‌తం ప‌లికి, ఆశీర్వ‌చ‌నం, స్వామివారి ప‌ట్టు వ‌స్త్రాల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ..సిఎం కెసిఆర్ ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.